rebel-star-vs-kamal-haasan
Home » రెబల్ స్టార్ Vs లోకనాయకుడు

రెబల్ స్టార్ Vs లోకనాయకుడు

by admin
0 comment

ప్రాజెక్ట్-కె… ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడీ సినిమా పాన్ వరల్డ్ స్థాయి దాటిపోయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, ఇందులోకి కమల్ హాసన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్ట్-కెలో ఓ పాత్ర కోసం కమల్ హాసన్ ను సంప్రదించారు మేకర్స్. అది కూడా అలాంటిలాంటి క్యారెక్టర్ కాదు, విలన్ పాత్ర. అవును.. ప్రాజెక్ట్-కెలో హీరో ప్రభాస్, విలన్ కమల్ హాసన్ అన్నమాట. ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. నిజంగా మెటీరియలైజ్ అయితే, కెవ్వు కేకే. మరి ఈ అరుదైన కాంబినేషన్ సెట్ అవుతుందా? అదే ఇప్పుడు 150 కోట్ల రూపాయల ప్రశ్న. అదేంటి.. 150 కోట్ల ప్రశ్న అని స్పెసిఫిక్ గా చెబుతున్నానని అనుకుంటున్నారా? దీనికి కూడా ఓ కథ ఉంది. ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తే 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యాడట నిర్మాత అశ్వనీదత్. అయితే ఇంతకీ కమల్ హాసన్ ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడా లేదా? కొంతమంది ఒప్పుకున్నాడని అంటున్నారు,మరికొందరు మాత్రం టైమ్ పడుతుందని అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం లాజిక్స్ తీస్తున్నారు. ఎందుకంటే, ప్రాజెక్ట్-కె షూటింగ్ ఇప్పటికే 70శాతం పూర్తయింది. మరి ఇలాంటి టైమ్ లో కమల్ హాసన్ వస్తే ఉపయోగం ఏంటి? బలమైన విలన్ పాత్ర అన్నప్పుడు హీరోతో సమానంగా ఉంటుంది కదా మేటర్. 70శాతం షూట్ అయిన సినిమాలోకి కమల్ హాసన్ వస్తాడా అనేది కొంతమంది లాజిక్. ఇది కూడా నిజమే. ఏదేమైనా ఈ సినిమాలో ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ బాగానే కనిపిస్తున్నాయి. మరోసారి యూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చేంతవరకు ఈ మేటర్ సెటిల్ కాదు. కానీ మనలోమన మాట.. ప్రాజెక్ట్-కెలోకి కమల్ హాసన్ వస్తే ఆ కిక్కే వేరప్పా.. ఆ..

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links