Home » Ramcharan Upasana – తండ్రి అయిన రామ్ చరణ్

Ramcharan Upasana – తండ్రి అయిన రామ్ చరణ్

by admin
0 comment

మెగా కాంపౌండ్ లో పండగ వాతావరణం కనిపిస్తోంది. రామ్ చరణ్ భార్య ఉపాసన, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు ఉదయం అపోలో హాస్పిటల్ లో ఆమె పాపకు జన్మనిచ్చింది. తల్లి-బిడ్డ క్షేమంగా ఉన్నారని అపోలో హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలిపింది.

డెలివరీ కోసం నిన్న సాయంత్రమే అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయింది ఉపాసన. ఆమెతో పాటు భర్త రామ్ చరణ్ కూడా హాస్పిటల్ కు వెళ్లాడు. రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఉపాసన కోసం ప్రముఖ వైద్య బృందాన్ని హాస్పిటల్ లో సిద్ధంగా ఉంచారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత, ఉపాసనకు డెలివరీ చేశారు.

రామ్ చరణ్, ఉపాసనకు పెళ్లయి 11 ఏళ్లయింది. చరణ్ తండ్రి అయితే సంతోషించాలని, మనవడు లేదా మనవరాలితో ఆడుకోవాలని ఉందంటూ చిరంజీవి ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు. మొత్తానికి చిరంజీవి ఆశ నెరవేరింది.

కొన్ని నెలల కిందట ఉపాసన గర్భం దాల్చింది. ఆ టైమ్ లో ఆమె జపాన్ లో, చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఉంది. ఆ తర్వాత తన బేబీ బంప్ తో ఆస్కార్ అవార్డుల వేడుకకు కూడా హాజరైంది. రీసెంట్ గా శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ కు, వరుణ్ తేజ-లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్ కు కూడా హాజరైంది. ఈ గ్యాప్ లో ఉపాసనకు గ్రాండ్ గా శ్రీమంతం నిర్వహించారు. కొంతమంది కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆమె దుబాయ్ వెళ్లి మరీ శ్రీమంతం జరుపుకుంది.

ఆ తర్వాత హైదరాబాద్ లో భారీ ఎత్తున మరో శ్రీమంతం వేడుక కూడా చేశారు. అలా తన మాతృత్వాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తూ, ఈరోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. ఉపాసనను చూసేందుకు చిరంజీవి, సురేఖ, అల్లు అర్జున్, అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు చాలామంది హాస్పిటల్ కు వస్తున్నారు. పుట్టిన బిడ్డకు అప్పుడే బిరుదు కూడా ఇచ్చారు మెగా ఫ్యాన్స్. చరణ్ కూతురికి మెగా ప్రిన్సెస్ అనే పేరు పెట్టారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links