Ramcharan – 12 వందల మందితో ఒక్కడు

ramcharan

రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై క్లయిమాక్స్ ఎపిసోడ్ సీన్స్ తీస్తున్నారు.

1200 మంది ఫైటర్ల మధ్య భారీ స్థాయిలో ఈ సన్నివేశాల్ని పిక్చరైజ్ చేస్తున్నారు. కేవలం ఈ క్లయిమాక్స్ పార్ట్ కోసమే హీరోతో పాటు నిర్మాత, దర్శకుడు అంతా గ్యాప్ తీసుకున్నారు. నిర్మాత దిల్ రాజు, ఈ కీలకమైన షెడ్యూల్ కోసం అన్ని పనులు పక్కనపెట్టారు. అటు శంకర్ కూడా ఈ షెడ్యూల్ కోసం కమల్ తో చేస్తున్న ఇండియన్-2కు గ్యాప్ ఇచ్చారు.

ఇక రామ్ చరణ్ సంగతి సరేసరి. ఈ క్లయిమాక్స్ షూటింగ్ కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యారు చరణ్. ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తిచేసి, సెప్టెంబర్ నుంచి బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాను స్టార్ట్ చేయబోతున్నాడు చరణ్. ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడతాడు చరణ్.

తమన్ సంగీతం అందిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, జయరాం, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400