Ram Pothineni – డబ్బింగ్ స్టార్ట్ చేసిన ‘ఉస్తాద్’

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో క్రేజీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మూవీకి ఇంకా పేరు పెట్టలేదు. టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్, మాస్‌ ఎక్కువగా ఉండబోతున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభమైయ్యాయి. ఈ మేరకు డబ్బింగ్ స్టూడియో నుంచి దర్శకుడు బోయపాటి ఫోటోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల, ఈ సినిమాలో రామ్ కు జోడీగా నటిస్తోంది. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. తమ్మిరాజు ఎడిటింగ్ అందిస్తుండగా, సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ స్థాయిలో మళ్లీ సక్సెస్ అందుకోలేకపోయిన రామ్, బోయపాటితో ఈసారి కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతానంటున్నాడు.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400