Kalki 2898 AD | కల్కిగా మారిన ప్రాజెక్టు-K, గ్లింప్స్ రిలీజ్

  • వైజయంతీ మూవీస్ ప్రాజెక్ట్ K కల్కి2898ADగా మారింది..
  • ఊహలను పునర్నిర్వచించే ఒక సైన్స్ ఫిక్షన్ అద్భుతం
  • కామిక్ కాన్ వేదికగా గ్లింప్స్ రిలీజ్

ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై వస్తోంది ప్రాజెక్టు-K. ఇప్పుడీ సినిమాకు అఫీషియల్ గా టైటిల్ ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి “కల్కి 2898 AD” అని పేరు పెట్టారు.

కల్కి2898AD గ్రాండ్ ఆవిష్కరణ ప్రతిష్టాత్మక శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)లో జరిగింది. హాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకర్షించింది ఈ సినిమా గ్లింప్స్.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన, కల్కి2898AD మూవీ గ్లింప్స్.. భారతీయ సినిమాలో మునుపెన్నడూ చూడని ప్రపంచాన్ని ప్రేక్షకులను పరిచయం చేసింది. 2898 సంవత్సరంలో సెట్ చేసిన సినిమా వాతావరణం, సెట్స్ ను గ్లింప్స్ లో అద్భుతంగా చూపించారు. గ్లింప్స్ లో తన ఎనర్జిటిక్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు ప్రభాస్.

వైజయంతీ మూవీస్ నుండి అశ్వని దత్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి ఇండస్ట్రీ ప్రముఖులు నటించారు.

ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400