PrabhuDeva – నాలుగోసారి తండ్రి అయిన ప్రభుదేవా

ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా నాలుగోసారి తండ్రి అయ్యాడు. ప్రభుదేవా రెండో భార్య హిమానీ సింగ్, ముంబైలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుదేవా మొత్తం కుటుంబంలో ఇదే తొలి ఆడ సంతానం కావడం విశేషం.

ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభుదేవా. అతను తన తండ్రి సుందరం, సోదరుడు రాజు సుందరంతో కలిసి ఇండియన్ సినిమా డాన్స్ ట్రెండ్ ను మార్చేశాడు. ఆ తర్వాత నటుడిగా మారాడు. శంకర్ తీసిన ప్రేమికుడు సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా పలు విజయాలందించాడు.

ఓవైపు నటుడిగా, కొరియోగ్రాఫర్ గా రాణిస్తూనే, మరోవైపు దర్శకుడిగా మారాడు. హిందీ, తెలుగులో సూపర్ హిట్ సినిమాలిచ్చాడు.వ్యక్తిగత విషయానికి వస్తే, ప్రభుదేవా సహ-డ్యాన్సర్ అయిన రమలత్‌తో ప్రేమలో పడ్డాడు. 1995లో తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఒక కొడుకు విశాల్ దేవ, 2008లో మరణించాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల ప్రభుదేవా-నయనతార దగ్గరయ్యారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.

అయితే మొదటి భార్య రమాలత్, దీనికి అభ్యంతరం తెలిపారు. అప్పట్లో దానిపై పెద్ద దుమారమే చెలరేగింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన నయనతార, ప్రభుదేవాకు దూరంగా జరిగింది. ఆ తర్వాత ప్రభుదేవా, అధికారికంగా తన మొదటి భార్యకు విడాకులిచ్చాడు. నయనతార వ్యవహారం నుంచి మెల్లగా బయటకొచ్చిన ఈ డాన్సర్.. ముంబయిలోని తన ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్ తో ప్రేమలో పడ్డాడు.

ప్రభుదేవాకు రెగ్యులర్ గా ఫిజియో థెరపీ చేసే హిమానీ, కొన్నాళ్లకు ప్రభుదేవాతో ప్రేమలో పడింది. ఇద్దరూ మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుదేవా ద్వారా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది హిమానీ.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400