Prabhas Tirumala – ఆల్రెడీ తిరుమలలో ల్యాండ్ అయిన ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నాడు. ప్రభాస్ తో పాటు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు, ఆదిపురుష్ టీమ్ సభ్యులు కొంతమంది ఈ సేవలో పాల్గొన్నారు.

ఈరోజు సాయంత్రం ఆదిపురుష్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్, తిరుపతిలో గ్రాండ్ గా జరగనుంది. ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో ఈ ఫంక్షన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందులో పాల్గొనేందుకు, నిన్ననే తిరుపతి చేరుకున్న ప్రభాస్, ఈరోజు పొద్దున్నే స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాడు.

రామాయణంలో కొంత భాగాన్ని ఆదిపురుష్ సినిమాగా తీసిన సంగతి తెలిసిందే. అందుకే యూనిట్ లో సభ్యులంతా భక్తిభావంతో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభాస్, శ్రీవారిని దర్శించుకున్నాడు.

ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కెరీర్ కు చాలా కీలకం. సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్ల తర్వాత వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్టవ్వాలి. లేదంటే అతడి మార్కెట్ పై ఆ ప్రభావం పడుతుంది. అందుకే ఆదిపురుష్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ హీరో. ఇక ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైలెట్స్ విషయానికొస్తే.. ఈ వేడుకలో 50 అడుగుల ఆదిపురుష్ హోలోగ్రామ్ ను విడుదల చేయబోతున్నారు.

ఇక ఆధ్యాత్మిక ప్రవచనకర్త చినజీయర్ స్వామి, ఈ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. ఇదే వేదిక పైనుంచి అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించబోతోంది ఆదిపురుష్ యూనిట్.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400