pooja hegde
Home » Pooja Hegde – డేంజర్ జోన్ లో పూజాహెగ్డే

Pooja Hegde – డేంజర్ జోన్ లో పూజాహెగ్డే

Pooja Hegde

by admin
0 comment

తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో పరిచయమైన భామ పూజా హెగ్దే. ఆ తర్వాత వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుందలో ఛాన్స్ అందుకుంది. తెలుగులో చేసిన రెండు సినిమాలు ఆకట్టుకోలేక పోవడంతో పూజా హెగ్దే మీద ఐరన్ లెగ్ ముద్ర వేశారు. అదే టైం లో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ కి జోడీగా చేసిన మొహంజోదారో సినిమా కూడా ప్లాప్ అవడంతో అమ్మడి మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది.

ఆ టైం లోనే హరీష్ శంకర్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాలో అవకాశం దక్కింది. ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవడంతో పూజా బేబ్ కి లక్ కలిసి వచ్చింది. డీజే నుంచి అవకాశాల విషయంలో వెనక్కి తిరిగి చూసుకోని పూజా హెగ్దే, స్టార్ హీరోల సినిమాలు చేస్తూ వచ్చింది. సినిమాల్లో తన గ్లామర్ షోతో మెప్పిస్తూ వస్తున్న అమ్మడికి మళ్లీ టాలీవుడ్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నట్టు కనిపిస్తోంది.

టాలీవుడ్ లో పూజా బేబీ కెరీర్ దాదాపు ముగిసినట్టే అనిపిస్తుంది. చేతిలో మహేష్ గుంటూరు కారం సినిమా మాత్రమే ఉంది. ఆ సినిమా నుంచి కూడా అమ్మడు ఎగ్జిట్ అయింది. అంతకంటే ముందు పవన్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కూడా పూజాహెగ్డే ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈ రెండు సినిమాలు డ్రాప్ అయిన తర్వాత పూజా చేతిలో మరో స్టార్ హీరో సినిమా కనిపించడం లేదు.

అంతేకాదు అవకాశాల కోసం రెమ్యునరేషన్ తగ్గిస్తానని చెప్పినా కూడా పూజా ని ఎవరు పట్టించుకోవట్లేదని తెలుస్తుంది. రీసెంట్ గా ఒక స్టార్ హీరో సినిమా ఆఫర్ చేతిదాకా వచ్చి చేజారినట్టు టాక్. దీంతో పూజా హెగ్డేకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని అంటున్నారు చాలామంది. ఆమె మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే కచ్చితంగా ఓ హిట్ కొట్టాల్సిందే.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links