క్రిమినల్ కేసులో ఇరుక్కున్న ఖిలాడీ బ్యూటీ

హీరోయిన్ డింపుల్ హయాతి ఊహించని విధంగా కేసులో ఇరుక్కుంది. హైదరాబాద్ లో ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. జర్నలిస్ట్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో ఉంటోంది డింపుల్. అదే అపార్ట్ మెంట్ లో, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కూడా ఉంటున్నారు. అతడికి చెందిన అధికారిక వాహనాన్ని డింపుల్ హయాతి, తన బీఎండబ్ల్యూతో ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా, రాహుల్ హెగ్డే డ్రైవర్ తో గొడవకు దిగింది. అధికారిక వాహనాన్ని కాలితో తన్నింది.

దీనిపై పోలీసు కేసు నమోదైంది. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినందుకుగాను డింపుల్ హయాతిపై సెక్షన్ 353, 341, 279 కింద కేసు వేశాడు రాహుల్ డ్రైవర్ చేతన్ కుమార్. దీనిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పార్కింగ్ విషయమై డింపుల్ తో చాలాసార్లు వాగ్వాదం జరిగిందని, ఎన్నిసార్లు చెప్పినా ఆమె తన తీరు మార్చుకోలేదనేది డ్రైవర్ వాదన.

మరోవైపు జరిగిన ఘటనపై డింపుల్ కూడా రియాక్ట్ అయింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుల్ని దాచిపెట్టలేరంటూ ట్వీట్ చేసింది. తాను డీసీపీ కారును తన్నలేదని అంటోంది. మరోవైపు జరిగిన ఘటనపై డింపుల్ లాయర్ కూడా మాట్లాడాడు. సీసీటీవీ ఫూటేజ్ విడుదల చేస్తే తప్పెవరిదో తెలుస్తుందని, సీసీటీవీ దృశ్యాల్ని ఎందుకు రిలీజ్ చేయడం లేదని ప్రశ్నించాడు.

లాయర్ చెబుతున్న ప్రకారం.. డీసీపీ తన వాహనాన్ని నిలిపిన స్థలం కూడా డింపుల్ దేనట. ఆమె కాబోయే భర్త డేవిడ్ కు చెందిన చెందిన పార్కింగ్ ప్లేస్ అదని చెబుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా, ఆ పార్కింగ్ ను డీసీపీ వాడుతున్నారని, దీంతో డింపుల్ ఆగ్రహం వ్యక్తం చేసిందనేది లాయర్ వాదన. ఏదేమైనా డింపుల్ పై క్రిమినల్ కేసు నమోదైంది, తప్పు ఎవరిదనేది కోర్టు తేలుస్తుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం