వరుస రాజకీయ పర్యటనలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో అతనుచేస్తున్న వారాహి యాత్రకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే జ్వరంలో కూడా ఆయన తన సినిమా పనుల్ని పూర్తి చేస్తున్నారు.
తాజా చిత్రం బ్రో కోసం డబ్బింగ్ చెప్పారు. పవన్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా బ్రో. ఈ సినిమా టీజర్ రెడీ అయింది. పవన్ డబ్బింగ్ చెబితే సరిపోతుంది. కానీ పవన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయినప్పటికీ, టీజర్ లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో డబ్బింగ్ చెప్పారు.
దీని కోసం భీమవరానికి డబ్బింగ్ ఎక్విప్ మెంట్ తీసుకెళ్లారు. ఇంట్లోనే జ్వరంతో ఇబ్బంది పడుతూ కూడా.. బ్రో సినిమా టీజర్ కు డబ్బింగ్ పూర్తిచేశారు పవన్. వచ్చే నెల 28న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. సముద్రఖని ఈ సినిమాకు దర్శకుడు. రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు బ్రో సినిమా టీజర్ రిలీజ్ అవుతుంది.
వచ్చే నెల 28న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. సముద్రఖని డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.