Shooting Updates – ఏ సినిమా ఎక్కడ?

పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోంది ఓజీ సినిమా. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజీత్ దర్శకుడు. మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరిగింది. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ మహాబలేశ్వర్ లో నడుస్తోంది. అందమైన లొకేషన్లలో పవన్, ప్రియాంక మోహన్ మధ్య ఓ సాంగ్ ను పిక్చరైజ్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు పవన్.

బాలకృష్ణ, అనీల్ రావిపూడి కాంబోలో కొత్త సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో బాలయ్య చురుగ్గా పాల్గొంటున్నాడు. వచ్చే వారం నుంచి జరగనున్న కొత్త షెడ్యూల్ లో హీరోయిన్ కాజల్ జాయిన్ అవుతుంది. బాలకృష్ణ-కాజల్ మధ్య ఓ సాంగ్ షూట్ చేయబోతున్నారు. శ్రీలీల ఈ సినిమాలో బాలయ్యకు కూతురిగా కనిపించనుంది. షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఓవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ గేమ్ ఛేంజర్ షూటింగ్ మాత్రం ఆగకుండా నడుస్తూనే ఉంది. హైదరాబాద్ లో ఈ సినిమా కోసం భారీ సెట్ వేసిన సంగతి తెలిసిందే. ఆ సెట్ లోనే గేమ్ ఛేంజర్ షూట్ నడుస్తోంది. రామ్ చరణ్ పై ప్రస్తుతం క్లయిమాక్స్ ఫైట్ పిక్చరైజ్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. కియరా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరో 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ నడుస్తుంది.

భోళాశంకర్ కోల్ కతాకు షిఫ్ట్ అయ్యాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో చిరంజీవి క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఓ యాక్షన్ బ్లాక్ కోసం కోల్ కతా వెళ్లారు. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్, ప్రేయసిగా తమన్న నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరు నుంచి వస్తున్న సినిమా ఇదే. ఆగస్ట్ లో రిలీజ్ ప్లాన్ చేశారు.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400