నేషనల్ థ్రిల్లర్ ‘స్పై’ వాయిదా పడిందనే రిపోర్ట్స్ తో హీరో నిఖిల్ ఫ్యాన్స్, సినీ అభిమానులు నిరాశ చెందారు. సుభాష్ చంద్రబోస్ హిడెన్ స్టొరీ, సీక్రెట్స్ ఆధారంగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఎలాంటి ఆలస్యం లేకుండా జూన్ 29న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. సినిమా విడుదలకు అటువంటి అనువైన డేట్ ని వారు మిస్ చేయకూడదనుకుంటున్నారు.
నిజానికి శరవేగంతో CGI పనులు జరుగుతున్నాయి. పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయడానికి మొత్తం 1000 మంది నైపుణ్యం కలిగిన CGI సాంకేతిక నిపుణులతో 4 కంపెనీలను నిర్మాతలు నియమించుకున్నారు.
ఈ వార్తని ధృవీకరిస్తూ నిఖిల్.. “క్వాలిటీ లాక్… టార్గెట్ లాక్… స్పై లాక్ 👉🏻 జూన్ 29న వరల్డ్‌వైడ్ థియేటర్లలో #IndiasBestKeptSecret #Netaji #SubhasChandraBose” అని ట్వీట్ చేశారు. మెషిన్ గన్ పట్టుకుని, సుభాష్ చంద్రబోస్‌తో సహా స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాల పక్కన నిలబడిన అద్భుతమైన పోస్టర్‌ను కూడా పంచుకున్నారు.
ఈ సినిమా టీజర్‌కి అన్ని భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ సినిమాను మరింత దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఈడీ ఎంట్రయిన్‌మెంట్స్‌పై కె రాజశేఖర్ రెడ్డి, సిఇఒగా చరణ్‌తేజ్ ఉప్పలపాటితో కలిసి భారీ స్థాయిలో నిర్మించారు
నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను అందించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ.. ఐదు భాషల్లో విడుదల కానుంది.
శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. గ్యారీ బిహెచ్ ఈ చిత్రానికి ఎడిటింగ్ కూడా చేస్తున్నారు.