మొన్నటివరకు భార్యాభర్తలుగా కలిసున్న నిహారిక కొణెదల, చైతన్య జొన్నలగడ్డ విడిపోయారంటూ చాన్నాళ్లుగా వార్తలొచ్చాయి. ఎట్టకేలకు అవి నిజమయ్యాయి. వీళ్లిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని నిహారిక కూడా కన్ ఫర్మ్ చేసింది.
చైతన్య మరియు తను పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని తెలిపిన నిహారిక.. ఈ సున్నిత సమయంలో తమను ఇబ్బంది పెట్టవద్దు అంటూ కోరింది. కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితం విషయంలో ప్రైవసీ కోరుకుంటున్నట్లు తెలిపిన నిహారిక.. తన పరిస్థితిని అంతా అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేసింది.
ఇంతకాలం అండగా ఉన్న కుటుంబానికి మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ మేరకు ఇనస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది నిహారిక. దాదాపు ఇదే విషయాన్ని చైతన్య కూడా కన్ ఫర్మ్ చేశాడు.
2020లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు నిహారిక-చైతన్య. అయితే ప్రొఫెషన్లు వేరు కావడంతో, ఇద్దరి మధ్య తొందరగానే అభిప్రాయ బేధాలు వచ్చాయి. దీంతో ఫ్లాట్ ఖాళీ చేసి తండ్రి నాగబాబు ఇంటికి వచ్చేసింది నిహారిక. అప్పట్నుంచి విడిగానే ఉంటోంది. రీసెంట్ గా జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లిలో కూడా నిహారిక ఒక్కర్తే కనిపించింది.