Home » NagaChaitanya – ఈసారి థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి

NagaChaitanya – ఈసారి థియేటర్లు బ్లాస్ట్ అవుతాయి

by admin
0 comment

ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడే తనకు సినిమా రిజల్ట్ అర్థమైపోతుందని అంటున్నాడు నాగచైతన్య. థ్యాంక్యూ సినిమాకు అలానే గెస్ చేశానని, అనుకున్నట్టుగానే అది ఫ్లాప్ అయిందన్నాడు.

ఇప్పుడు అదే ఎడిట్ రూమ్ లో కస్టడీ సినిమా చూశానని, అదిరిపోయిందని చెబుతున్నాడు. ఈ సినిమాతో థియేటర్లు బ్లాస్ట్ అవుతాయంటున్నాడు నాగచైతన్య. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని చెబుతున్నాడు. రాత్రి జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడాడు చైతూ.

“ఇళయరాజా గారు, యువన్ శంకర్ రాజా గారి సంగీతం బ్లాక్ బస్టర్. థియేటర్ లో నేపధ్య సంగీతం ఒక రచ్చ. థియేటర్ లో ఒక మ్యాజిక్ చూపిస్తారు. సినిమా మొదటి 20 నిమిషాలు కూల్ గా వెళుతుంది. ఇంటర్వెల్ కి ముందు నుంచి థియేటర్ లో బ్లాస్ట్ అవుతుంది. అద్భుతమైన యాక్షన్స్ సీక్వెన్స్ లు ఉంటాయి. మీరు కొత్త నాగచైతన్య ని చూడబోతున్నారు. వెంకట్ ప్రభు అలా డిజైన్ చేశారు. మీ అందరూ నా కస్టడీ లోకి రావాలని, నా కస్టడీలోనే ఉండాలని కోరుకుంటున్నాను. మే 12న అందరం థియేటర్ లో కలుద్దాం.”

ఇలా కస్టడీ సినిమాపై అంచనాలు పెంచేలా మాట్లాడాడు నాగచైతన్య. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా నటించగా.. కీలక పాత్రల్లో ప్రియమణి, శరత్ కుమార్ కనిపించనున్నారు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది కస్టడీ.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links