మహేష్ గారు.. స్మార్ట్ ఫోన్ రోజులో ఎంత సమయం వాడుతారు ? మీ అందరిలానే చాలా సమయం వాడుతాను. ఒకొక్కసారి తలకాయ నొప్పి వచ్చి ఆపేయడానికి కూడా ప్రయత్నిస్తాను( నవ్వుతూ).
మీరు వాడే ఫోన్ ఏమిటి ? ఎన్ని ఫోన్లు మారుస్తారు ? నేను చెప్పను. నేను తిరిగేటప్పుడు మీరే పరిశీలించండి (నవ్వుతూ)
మీరు అంబాసిడర్ గా చేసిన ప్రొడక్ట్స్ ని వాడుతారా? బిగ్ సి లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని వాడాను.
మీరు తీసిన ఫొటోస్ లో బాగా గుర్తుండిపోయిన ఫోటో ఏది ? చాలా ఉంటాయండి.
ఫోన్ వాడకంలో మీ పిల్లలకు కూడా స్వేచ్ఛ ఇస్తారా? నేను ఇవ్వడం ఏమిటి .. వాళ్ళే తీసుకున్నారు (నవ్వుతూ)
మీ ఫోన్ రింగ్ టోన్ ఏమిటి? నాది సైలెంట్ టోన్ (నవ్వుతూ).
మీరు ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళినపుడు మీ అనుభూతి ఎలా ఉంటుంది ? నాకు సంబంధించిన వస్తువులన్నీ నా భార్య కొనుక్కొని తీసుకొస్తుంది. అయితే నేరుగా వెళ్లి బిగ్ సి లాంటి స్టోర్స్ లో ఫోన్ కొనుక్కోవడంలో ఆనందం వేరుగా ఉంటుంది.