Hi, Hello, Welcome to News360 Telugu… మనం ఎంతోమంది హీరోల్ని చూశాం, ఇంకెంతోమంది దర్శకుల్ని చూశాం. స్క్రీన్ ప్లే రైటర్స్ తెలుసు, సంగీత దర్శకులు కూడా తెలుసు. కానీ ఇవన్నీ ఒకరే చేసే వ్యక్తి ఎస్వీ కృష్ణారెడ్డి. టాలీవుడ్ లో సిసలైన ఆల్ రౌండర్ ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయనే కథ రాసుకున్నారు, ఆయనే స్క్రీన్ ప్లే సమకూర్చుకుంటారు, ఆయనే బాణీలు కూడా ఇస్తారు, ఆయనే సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తారు. అంతేకాదు.. ఆయనే హీరోగా కూడా నటించగలరు. పాటలు కూడా పాడతారు. ఇలా అన్నీ చేయగల ఏకైక వ్యక్తి ఎస్వీ కృష్ణారెడ్డి.
కల్తీ లేని కథ.. స్వచ్ఛమైన హాస్యం.. సరదా గొలిపే సన్నివేశాలు… అడుగడుగునా వినోదం పంచే స్క్రీన్ ప్లే.. ఆయన సినిమాల గొప్పతనం. అసభ్యతకు ఎలాంటి తావు ఇవ్వకుండా.. మన సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేసి.. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎన్నో వినోదాత్మకమైన చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకుడు ఆయన. 1990, 2000 దశకాల్లో ఆయన తీసిన చిత్రాలు సంచలనం సృష్టించాయి. యేడాదిపాటు ఆడిన చిత్రాలున్నాయి. ఆయన పేరు యస్వీ కృష్ణారెడ్డి.
అసలు పేరు సత్తి వెంకట కృష్ణారెడ్డి. సొంతూరు తూర్పు గోదావరి జిల్లా, కొంకుదూరు గ్రామం. అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత రాయవరం అనే ఊరిలో హైస్కూల్ చదివారు. అక్కడ్నుంచి ఆరవెళ్లి అనే గ్రామానికి కృష్ణారెడ్డి కుటుంబం వలస వెళ్లిపోయింది. అక్కడే అచ్చిరెడ్డి పరిచయం. నిజానికి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి క్లాస్ మేట్స్ కాదు, ఇద్దరూ స్కూల్ మేట్స్. ఇంకా చెప్పాలంటే, కృష్ణారెడ్డి సీనియర్, అచ్చిరెడ్డి జూనియర్. అయినప్పటికీ ఒకే ఊరు కావడం వల్ల మంచి స్నేహితులయ్యారు.
కాలేజ్ డేస్ నుంచి నాటకాల పిచ్చి. నాటకాలకు డైరక్షన్ చేసేవారు. అలా డైరక్షన్ చేయడంతో పాటు, తను అనుకున్న కథల్ని ఫ్రెండ్స్ కు నెరేట్ చేసేవారు. చిన్నప్పట్నుంచి కృష్ణారెడ్డికి ఈ అలవాటు ఉంది. అలా తనకంటూ ఓ గ్రూప్ మెయింటైన్ చేసేవారు కృష్ణారెడ్డి. అందులో అచ్చిరెడ్డి కూడా సభ్యుడే. చదువు పూర్తయిన తర్వాత కృష్ణారెడ్డి, ఉన్నత చదువు కోసం భీమవరం వెళ్లిపోయారు. అచ్చిరెడ్డి అత్తిలి వెళ్లారు. అలా ఇద్దరూ విడిపోయినప్పటికీ.. ఆరవెళ్లిలో ప్రతి వారం కలుసుకునేవారు.
కృష్ణారెడ్డికి మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి. అందుకే ఎం.కామ్ పూర్తి కాగానే సినిమా నటుడిగా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళారు. మద్రాసు వెళ్ళిన వెంటనే అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ రాలేదు. తొలి ప్రయత్నంతో పగడాల పడవ అనే సినిమాలో హీరోగా చేశారు. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఈయన చేసే ప్రయత్నాలన్నీ స్నేహితుడు అచ్చిరెడ్డికి తెలియజేస్తూ ఉండేవాడు. కృష్ణారెడ్డి మీద అపారమైన నమ్మకం కలిగిన ఆయన అతన్ని నటుడ్ని చేయాలంటే తానే నిర్మాత అవతారం ఎత్తాలనుకున్నాడు.
కృష్ణారెడ్డి హైదరాబాదుకు రాగానే సినిమా తీయడం కోసం ఇద్దరూ కలిసి అనేక వ్యాపారాలు చేశారు. ముందుగా చిట్స్ వ్యాపారం చేశారు, అది సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఓ టీ బిజినెస్ పెట్టారు. అది కూడా సక్సెస్ కాలేదు. పిల్లలు తినే గొట్టాల మేనుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు. కొన్నాళ్లకు అది కూడా మూసేశారు. ఆ తర్వాత స్వీట్స్ కంపెనీ కూడా పెట్టారు. అందులో కృష్ణారెడ్డి స్వయంగా కొన్నేళ్ల పాటు కాజాలు కూడా తయారుచేశారు. ఇన్ని వ్యాపారాలు చేసి, కష్టపడింది కేవలం సినిమాలు తీయడం కోసమే.
అలా కొంత డబ్బు సంపాదించిన తర్వాత కొబ్బరిబొండాం సినిమా తీశారు. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఆ సినిమా హిట్టయింది. కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డికి డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత రెండో సినిమాకే దర్శకుడిగా మారారు ఎస్వీ కృష్ణారెడ్డి. రాజేంద్రుడు-గజేంద్రుడు నుంచి దర్శకుడిగా మారారు. ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది.
ఇక అప్పట్నుంచి కృష్ణారెడ్డి-అచ్చిరెడ్డి కాంబినేషన్ కు ఎదురులేకుండా పోయింది. మాయలోడు, నంబర్ వన్, యమలీల, శుభలగ్నం.. ఇలా ఏడాదికో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. దీంతో వీళ్లిద్దరి పేర్లు టాలీవుడ్ లో మారుమోగిపోయాయి. మరీ ముఖ్యంగా యమలీల నుంచి ఎస్వీ కృష్ణారెడ్డి స్టార్ అయిపోయారు. అప్పటివరకు చిన్న చిన్న వేషాలు వేసుకునే అలీని హీరోను చేసి ఆ సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ మూవీ ఏకంగా 250 రోజులు ఆడింది.
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా హిట్టయింది. ఘటోత్కచుడు, మావిచిగురు, ఆహ్వానం, వినోదం, ఎగిరే పావురమా, ఇలా అన్నీ హిట్స్ ఇచ్చారు. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా తీస్తే హిట్ గ్యారెంటీ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలపడిపోయింది.
కేవలం సినిమాలకు డైరక్షన్ చేయడమే కాకుండా.. బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చేవారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన సినిమాల్లో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్. ఇప్పటి తరం కూడా హమ్ చేసుకునేలాంటి హిట్ సాంగ్స్, మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలొడీలు ఎస్వీ కృష్ణారెడ్డి అందించారు. కథ తనదే అయినప్పుడు, అందులో సన్నివేశం కూడా తనే రాసినప్పుడు, నటుడు నటించే భావం కూడా తను చెప్పిందే అయినప్పుడు, ఆ సీన్ కు సంబంధించిన సంగీతం కూడా ఆటోమేటిగ్గా పుట్టుకొస్తుందంటారు ఎస్వీ కృష్ణారెడ్డి.
దర్శకుడిగా సూపర్ సక్సెస్ అయిన టైమ్ లోనే హీరోగా మారారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఉగాది, అభిషేకం లాంటి సినిమాలు చేశారు. హీరోగా మారి మరింత బాధ్యత మోసినప్పటికీ.. ఆయన సంగీతంలో మేజిక్ మాత్రం తగ్గలేదు. ఓ మోస్తరుగా ఆడిన సినిమాల్లో కూడా సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు కృష్ణారెడ్డి.
కెరీర్ లో చిన్న గ్యాప్ ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి రీసెంట్ గా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాను తీశారు. ఈ సినిమాతో ఆయన డైలాగ్ రైటర్ గా కూడా మారారు. తను మరిన్ని సినిమాలు తీస్తానని, ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్ని అందిస్తానంటున్నారు ఈ దర్శకుడు.
కెరీర్ లో ఎన్నో రోల్స్ పోషించిన ఎస్వీ కృష్ణారెడ్డి, 3 సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా పోషించారు. కిరాతకుడు, సంబరం, నేను మీకు బాగా కావాల్సినవాడ్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిశారు. ఎస్వీ కృష్ణారెడ్డి అందుకున్న అవార్డులకు లెక్కలేదు. సకుటుంబ సపరివార సమేతం అనే సినిమాకు బెస్ట్ డైరక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. ఆహ్వానం సినిమాకు బెస్ట్ డైరక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డ్ కూడా అందుకున్నారు. ఇక శుభలగ్నం సినిమాకు కూడా ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు.
టాలీవుడ్ లో దాసరి నారాయణరావు తర్వాత ఆ స్థాయిలో బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న వ్యక్తి ఎస్వీ కృష్ణారెడ్డి మాత్రమే. జూన్ 1న ఎస్వీ కృష్ణారెడ్డి తన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది న్యూస్360 తెలుగు.

ప్రయోగాలకు పెట్టింది పేరు, సాహసానికి మారుపేరు, రికార్డులకు కేరాఫ్ అడ్రస్, సూపర్ స్టార్ కృష్ణ. వరుసపెట్టి సినిమాలు చేయడంలో కృష్ణ తర్వాతే ఎవరైనా. ఆయనంత స్పీడ్ గా అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు చేయలేకపోయేవారు. 80వ దశకంలో ఇండస్ట్రీ కళకళలాడిందంటే దానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ. 24 విభాగాలకు ఏడాది పొడుగునా, చేతినిండా పని కల్పించిన ఏకైక హీరో కృష్ణ. అంతెందుకు, చివరికి పోస్టర్లు వేసుకునే ప్రింటింగ్ ప్రెస్ కూడా కృష్ణ సినిమాల వల్ల కళకళలాడింది.
ఆయన గన్ పడితే జేమ్స్ బాండ్ .. గుర్రమెక్కితే కౌబాయ్… విల్లంబులు ధరిస్తే అల్లూరి సీతారామరాజు… కురుక్షేత్రంలో అర్జునుడు.. జానపదాల్లో మహాబలుడు… చారిత్రకాల్లో విశ్వనాథనాయకుడు. టోటల్ గా తెలుగు సినిమా సాంకేతికతను సింహాసనమెక్కించిన మకుటం లేని మహారాజు. అంతేకాదు.. మాస్ జనం గుండెల్లో కిరాయి కోటిగాడు.. రామరాజ్యంలో భీమరాజు. పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి… ఆయన పూర్తి పేరు. అభిమానుల ముద్దుపేరు సూపర్ స్టార్ కృష్ణ.
ఇప్పటి తరం హీరోలు ఒక సినిమా చేయడానికే ఏదో మహాయజ్నం చేసినట్టు ఫీలయిపోతున్నారు. కానీ అప్పట్లో కృష్ణ రోజుకు మూడు షిఫ్ట్ ల్లో.. అవసరమైతే నాలుగు షిఫ్టుల్లో పనిచేసి.. సంవత్సరానికి యావరేజ్ గా 15 సినిమాల వరకూ నటించిన తిరుగులేని హీరో. ఆయన జయాపజయాలకు అతీతం. జనాదరణ పొందిన చిత్రాలు చేయడం, అత్యధిక సినిమాల్లో నటించడం, చలన చిత్రానికి సాంకేతిక హంగులు అద్దడం, మూడు షిఫ్టుల్లో పనిచేయడం, సాహసోపేతమైన కథలను ఎంచుకోవడం, కర్షక, కార్మికుల పక్షాన నటించడం, చిత్ర నిర్మాణం, దర్శకత్వం, స్టూడియో నిర్వహణ… ఇవన్నీ ఘట్టమనేని కృష్ణను అక్షరాలా తెలుగు చిత్ర పరిశ్రమకు సూపర్ స్టార్ ను చేశాయి.
‘తేనెమనసులు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన కృష్ణ… కెరీర్ బిగినింగ్ లోనే జేమ్స్ బాండ్, కౌబాయ్ చిత్రాల్లోనూ నటించి.. ఆ తరహా చిత్రాలకు ఒక బ్రాండ్ గా మారారు. ఆపై ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించి.. తెలుగు ప్రేక్షకులకు అభిమాన హీరో అయ్యారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు కృష్ణ 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశారు.
ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన తేనె మనసులు చిత్రంతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ. తొలి చిత్రంతోనే హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. అయితే ఆయన ఎక్కడా ఇమేజ్ చట్రంలో చిక్కుకోవాలనుకోలేదు. అందుకే హీరోగా ఎన్నో వైవిధ్యమైన కథలను, పాత్రలను ఎంచుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక కృష్ణను మాస్ ఆడియెన్స్ కు దగ్గర చేసిన చిత్రం గూఢచారి 116. ఈ సినిమా సాధించిన సక్సెస్ లో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త జేమ్స్ బాండ్ దొరికాడని ఇండస్ట్రీ భావించింది. లవ్ ఇన్ ఆంధ్ర, అందరికీ మొనగాడు, మాస్టర్ కిలాడి, జేమ్స్ బాండ్ 777, ఏజెంట్ గోపి, రహస్య గూఢచారి, గూఢచారి 117 వంటి జేమ్స్ బాండ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
హాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన కౌబాయ్ పాత్రను తెలుగు నెటివిటీలోకి తీసుకొచ్చి మన ఎమోషన్స్, మన కథాగమనానికి తగినట్లు ఆ పాత్రను మలిచి తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్ ను పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. ఈయన నటించిన తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. అప్పట్లో రాజస్థాన్ థార్ ఎడారిలో ఈ సినిమాను రూపొందించారు. ట్రెజర్ హంట్ పేరుతో విదేశీ భాషకు అనువాదమైన తొలి తెలుగు చిత్రమిదే. అలాగే మోసక్కారనక్కు మోసకారన్ తమిళంలో, గన్ ఫైటర్ జానీ పేరుతో హిందీలోకి అనువాదమై అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. అలాగే కృష్ణ నటించిన అవేకళ్లు తొలి కలర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కడ నుంచి ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో కృష్ణ నటించి తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్లో మూడు చారిత్రాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. అందులో అల్లూరి సీతారామరాజు సినిమా ఒకటి. స్వాతంత్ర్యం కోసం పోరాడి అసువులు బాసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుపై తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా మేకింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో అడ్డంకులు ఎదురైనా, వాటిని ధైర్యంగా ఫేస్ చేసి సినిమాను పూర్తి చేసి కృష్ణ తప్ప మరెవరూ అలాంటి పాత్రను చేయలేరు అనేంత గొప్పగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమా తర్వాత విడుదలైన 14 సినిమాలు కృష్ణకు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయంటే అల్లూరి సీతారామరాజు చిత్రం ఎంత ప్రభావాన్ని చూపిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే విజయనిర్మలను దర్శకురాలిగా మీనా చిత్రంతో పరిచయం చేసి హిట్ కొట్టారు.
తెలుగులో ఎక్కువ మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఈయన 50కి పైగా మల్టీస్టారర్ సినిమాల్లో నటించి రికార్డ్ క్రియేట్ చేశారు. ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్. శివాజీ గణేషన్. రజినీకాంత్, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి.బాలకృష్ణ. నాగార్జున, మోహన్ బాబు, మురళీమోహన్, రాజశేఖర్, సుమన్, రవితేజ ఇలా అందరి హీరోలతో కృష్ణ కలిసి సినిమాలు చేశారు. అలాగే తన తనయులు రమేశ్ బాబు, మహేశ్ తో కలిసి ముగ్గురు కొడుకులు అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు కృష్ణనే నిర్మించడం విశేషం. అలాగే కృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ బలంగా ఉంది. ఆయన సినిమాలు ఎన్నో సంక్రాంతికి విడుదలై సూపర్ డూపర్ హిట్స్ సాధించాయి.
ప్రతి క్షణం నిర్మాతల క్షేమం గురించి ఆలోచించే ఏకైక హీరో కృష్ణ. ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టే పని ఒక్కటి కూడా చేసేవారు కాదు. రోజులో 18 గంటలు వర్క్ చేసి ఎందరో నిర్మాతల్ని ఆదుకొని సూపర్ స్టార్ అనిపించుకున్నారు. కృష్ణ కోసం నిర్మాతలుగా మారిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కృష్ణ డేట్స్ దొరికితే ఆసక్తి చాలనుకునేవారు. తనతో సినిమా చేసి ఆడకపోతే మరోసారి డేట్స్ ఇచ్చి సినిమా చేసుకోమనే మంచి మనసున్న హీరో కృష్ణ. మరోవైపు, తనే నిర్మాతగా అగ్నిపరీక్ష, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు అల్లూరి మనుషులు, సీతారామరాజు, దేవుడు చేసే మనుషులు, కురుక్షేత్రం, ఈనాడు, దేవదాసు వంటి సినిమాలను నిర్మించారు. అలాగే సింహాసనం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, కలియుగ కర్ణుడు వంటి ఎవర్ గ్రీన్ చిత్రాలతో దర్శకుడిగానూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. కృష్ణ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో తన పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై సినిమాలు నిర్మించి నిర్మాతగా విజయాలను సొంతం చేసుకున్నారు.
1972 సంవత్సరంలో హీరోగా 17 చిత్రాలను ఒకే సంవత్సరంలో విడుదల చేసి ప్రపంచ రికార్డు సాధించారు. ఇలాంటి రికార్డులు మరెన్నో కృష్ణ సొంతం. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొదటిసారి సినిమా స్కోప్ టెక్నాలజీని వాడుతూ అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తీశారు, అది కృష్ణ కి 100వ చిత్రం. అలాగే తన 200వ చిత్రం ఈనాడు కి మొదటిసారి ఈస్ట్ మన్ కలర్ టెక్నాలజీని వాడారు కృష్ణ. దీంతోపాటు తన 300వ చిత్రం ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెలుగువీర లేవరా చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మొదటి డి టి ఎస్ టెక్నాలజీని వాడారు. ఇవే కాకుండా మొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, మొదటి తెలుగు జేమ్స్ బాండ్ చిత్రం గూడచారి 116 లాంటి మరెన్నో ప్రయోగాలు చేస్తూ, ఎప్పటికప్పుడు తెలుగు సినిమా ప్రేమికుల్ని అలరించారు కృష్ణ, విజయనిర్మల కలిసి 48 సినిమాలు నటించారు. విజయనిర్మల తర్వాత కృష్ణతో హీరోయిన్ గా 47 చిత్రాలు చేసిన హీరోయిన్ జయప్రద.
తన కెరీర్ లో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు కృష్ణ. 2009లో భారతప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ అవార్డ్ ప్రదానం చేసింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అల్లూరి సీతారామరాజు సినిమాకు గాను ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. 2003లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ వరించింది. 1997లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డ్ అందుకున్నారు. కేవలం ఇవి కొన్ని మాత్రమే.
వివాదాలకు దూరంగా, మకుటం లేని మహారాజుగా, టాలీవుడ్ స్క్రీన్ పై సూపర్ స్టార్ గా నిలిచిపోయిన ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా, ఆయనకు నివాళులు అర్పిస్తోంది News360Telugu