తల్లి కాబోతున్న గోవా బ్యూటీ

గోవా బ్యూటీ ఇలియానా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. పొద్దున్నే 2 ఫొటోలు పెట్టింది ఇల్లీ బేబీ. అందులో ఒక ఫొటోలో కొత్త ఎడ్వెంచర్ కోసం రెడీ అని ఓ టీషర్ట్ పై రాసి ఉంది. ఇక మరో ఫొటోలో ఓ చిన్న చైన్ పై మామా అని రాసి ఉంది. ఈ రెండు ఫొటోలతో తను తల్లి కాబోతున్న విషయాన్ని బయటపెట్టింది.

ఇలియానా భర్త ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కొన్నాళ్ల కిందట ఓ ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ను పెళ్లాడింది ఇలియానా. ఆ వెంటనే అతడికి విడాకులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సింగిల్ గానే ఉందని చాలామంది అనుకుంటున్నారు. అంతలోనే ఇలా తల్లి కాబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది.

ప్రస్తుతం ఇలియాకు శుభాకాంక్షలు అందించే బ్యాచ్ కొందరైతే, పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అని ప్రశ్నించే బ్యాచ్ ఇంకోటి తయారైంది. ఆమె సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వబోతోందని కొందరు, బిడ్డను దత్తత తీసుకోబోతోందని మరికొందరు సోషల్ మీడియాలో వాదించుకుంటున్నారు.

టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో హీరోయిన్ గా మారింది ఇలియానా. ఆ తర్వాత వరుసపెట్టి బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. పోకిరి, జులాయి, జల్సా లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఒక దశలో టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ స్టేటస్ కూడా ఎఁజాయ్ చేసింది. ఆ ఇమేతో బాలీవుడ్ కు వెళ్లి బోల్తా కొట్టింది. ప్రారంభంలో 2 హిట్స్ వచ్చినప్పటికీ ఆమె కెరీర్ ఊపందుకోలేదు. దీంతో అటు బాలీవుడ్ లో సినిమాలు చేయలేక, ఇటు టాలీవుడ్ లో అవకాశాలు రాక ఒంటరిగా మిగిలిపోయింది ఈ బ్యూటీ.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400