Heroines Yoga – యోగా భామలు

భారతదేశ యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు.. ఐక్యరాజ్యసమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో యోగా డేలు జరుగుతున్నాయి. ఈ విషయంలో మన హీరోయిన్లు కూడా తక్కువేం కాదు. గ్లామర్ గా కనిపించాలంటే కేవలం ముఖానికి మేకప్ వేసుకుంటే సరిపోదు, యోగా కూడా అవసరమని హీరోయిన్లకు తెలుసు. అందుకే తమ నిగారింపును కాపాడుకునేందుకు యోగా చేస్తుంటారు.

ఉదయం లేచిన వెంటనే కాజల్ దినచర్య యోగాతోనే మొదలవుతుంది. సూర్య నమస్కారాలు చేయకపోతే తనకు ఆ రోజంతా ఏదోలా ఉంటుందని చాలాసార్లు ప్రకటించింది ఈ చందమామ. ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్లవుతున్నా.. ఇప్పటికీ ఆమె రూపం, ఫిజిక్ చెక్కుచెదరలేదంటే దానికి యోగా కూడా ఓ కారణం.

మిల్కీబ్యూటీ తమన్న కూడా యోగా లవరే. ప్రతి రోజూ యోగసనాలు వేస్తుంది. అంతేకాదు.. నెలకు కనీసం ఒక కొత్త యోగాసనం నేర్చుకోవాలని నియమం కూడా పెట్టుకుంది. సూర్య నమస్కారాలతో పాటు హృదయ ముద్ర తనకు ఎంతో ఇష్టం అంటోంది తమన్నా.

వ్యాయమంతో ప్రారంభమైన సమంత జీవితం ఇప్పుడు యోగా టర్న్ తీసుకుంది. ఒకప్పుడు ఎక్సర్ సైజ్ కు ఎక్కువ టైమ్ కేటాయించిన ఈ బ్యూటీ, ఇప్పుడు యోగాసనాలకు ఎక్కువ టైమ్ ఇస్తోంది. లాక్ డౌన్ టైమ్ అంతా యోగా, టెర్రస్ గార్డెనింగ్ తోనే గడిచిపోయిందని చెబుతోంది. ఇప్పటికీ పొద్దున్న లేస్తే సమంత చేసేది యోగానే.

తన సన్నజాతి తీగలాంటి శరీరాకృతికి యోగానే కారణం అంటోంది పాయల్. మరీ ముఖ్యంగా కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ వ్యాయామం, యోగా ద్వారా 30 రోజుల్లో 63 కిలోల నుంచి 58 కిలోలకు తగ్గింది. అంతా యోగా మహత్యం అంటోంది.

సీనియర్ నటి భూమికకు చిన్నప్పట్నుంచి యోగా అలవాటు. తన భర్త భరత్ ను కూడా యోగా ద్వారానే కలుసుకుంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఇంట్లో రెగ్యులర్ గా యోగా చేస్తుంటారు. యోగా తన జీవితంలో భాగం అంటున్న భూమిక, దానికి సంబంధించిన ఫొటోల్ని మాత్రం సోషల్ మీడియాలో పెద్దగా పోస్ట్ చేయదు.

హీరోయిన్ అనుష్క ఓ యోగా టీచర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె వృత్తి యోగా పాఠాలు చెప్పడం. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. యోగా ద్వారా జీవితం అంటే ఏంటో తెలుసుకున్నానని, జీవన విధానాన్ని నేర్చుకున్నానని చెబుతుంది మన బొమ్మాలి.

తన జీవితంలో తొలి ప్రాధాన్యం ఫిట్ నెస్ కే ఇస్తానంటుంది రకుల్. ఫిట్ నెక్ కోసమే పుట్టిందేమో అనిపించే రకుల్, యోగాను తన జీవితంలో ఓ భాగంగా చేసుకుంది. ఒకప్పుడు జిమ్ లో కసరత్తులకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చిన ఈ మెరుపుతీగ, ఇప్పుడు యోగాసనాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తోంది.

నభా నటేష్ కూడా యోగా బ్యూటీనే. మనం ఎంత తిన్నా యోగా చేస్తే బరువు అదుపులో ఉంటుందని చెబుతుంది నభా. చెప్పడమే కాదు, దాన్ని చేసి చూపిస్తుంది కూడా.

యోగాను, జిమ్ ను బ్యాలెన్స్ చేస్తుంది శృతిహాసన్. పొద్దున్న జిమ్ చేస్తే, రాత్రికి యోగా చేస్తుంది. ఇప్పటికే కొన్ని యోగసనాల్లో మాస్టర్ అయిపోయింది ఈ చిన్నది. యోగాను అందరూ తమ జీవన విధానంగా మార్చుకోవాలని పిలుపునిస్తోంది.

డెయిలీ యోగా ప్రాక్టీస్ చేసే హీరోయిన్ల లిస్ట్ లో సుశ్మిత సేన్, శిల్పాశెట్టి కూడా ఉన్నారు. కష్టమైన యోగాసనాల్ని కూడా ఎంతో ఇష్టంగా, అలవోకగా వేస్తుంది సుశ్మిత సేన్. అటు శిల్పా శెట్టి కూడా రకరకాల యోగాసనాలు వేసి, దాదాపు యోగా మాస్టర్ అయిపోయింది. ఈమె చాలా ఏళ్ల కిందటే యోగా సీడీలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400