హ్యాట్రిక్ కాదు, అంతకుమించి..

టాలీవుడ్ లో హ్యాట్రిక్ కొట్టడం కొత్తేంకాదు. ఎంతోమంది హీరోలు, తమ ఫేవరెట్ దర్శకులతో హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చారు. హీరో-దర్శకుడు కలిసి హ్యాట్రిక్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఈ తరం హీరోల వరకు చాలామంది ఈ లిస్ట్ లో కనిపిస్తారు. కానీ ఇప్పుడు హ్యాట్రిక్ దాటి నాలుగో సినిమాకు రెడీ అవుతున్నారు. అలాంటి హీరో-దర్శకుల క్రేజీ కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి.

అల్లు అర్జున్, త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ లో నాలుగో సినిమా ఎనౌన్స్ అయింది. హారిక-హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమా ఇది. ఇంతకుముందు బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు చేశారు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో నాలుగో సినిమా రాబోతోంది.

అల్లు అర్జున్, సుకుమార్ ది కూడా ఇలాంటి కాంబోనే. ఆర్య, ఆర్య-2, పుష్ప సినిమాలొచ్చాయి. ఇప్పుడు నాలుగో చిత్రంగా పుష్ప-2 రూపుదిద్దుకుంటోంది. రాబోయే రోజుల్లో తమ కాంబినేషన్లో మరిన్ని సినిమాలొస్తాయని, బన్నీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

నాలుగు సినిమాల కాంబోలో రవితేజ-గోపీచంద్ మలినేని కూడా ఉన్నారు. గతంలో వీళ్లిద్దరూ కలిసి డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు చేశారు. ఇప్పుడు నాలుగోసారి కలిశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వీళ్లిద్దరూ కలిసి ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయబోతున్నారు. ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

బాలకృష్ణ-బోయపాటి కూడా వరుసగా నాలుగోసారి కలవబోతున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలొచ్చాయి. ఈపాటికే వీళ్లిద్దరి కాంబోలో మరో సినిమా ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఇటు బోయపాటి, అటు బాలయ్య ఇద్దరూ బిజీ అయ్యారు. తమ ప్రాజెక్టులు పూర్తిచేసిన తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా ప్రకటన ఉంటుంది.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400