Home » Gandeevadhari Aarjuna | గాండీవధారి అర్జున మూవీ రివ్యూ

Gandeevadhari Aarjuna | గాండీవధారి అర్జున మూవీ రివ్యూ

by admin
0 comment

నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమతం తదితరులు..
రచన-దర్శకుడు : ప్రవీణ్ సత్తారు
నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: ముకేష్ జీ
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
నిడివి: 2 గంటల 17 నిమిషాలు
సెన్సార్: UA
రేటింగ్: 2/5

కథ
సినిమాలో హీరో పేరు అర్జున్. ఇతడో మాజీ ఏజెంట్. తల్లికి చికిత్స కోసం లండన్ వెళ్తాడు. అదే టైమ్ లో సెంట్రల్ మినిస్టర్ ఆదిత్య రాజ్ కూడా ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు లండన్ వెళ్తాడు. ఆదిత్యను విలన్ టార్గెట్ చేస్తాడు. విలన్ నుంచి ఆదిత్యన రక్షించేందుకు రంగంలోకి దిగుతాడు అర్జున్. వీళ్లిద్దరి మధ్యలో హీరోయిన్ ఐరా ఉంటుంది. ఆదిత్య-ఐరా మాజీ లవర్స్. ఇలా ఎన్నో సబ్ ప్లాట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ సందేశాన్ని కూడా ఇచ్చారు. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు
తన హైట్ కు తగ్గ పాత్ర పోషించాడు వరుణ్ తేజ్. సూట్ వేసుకొని, బాడీగార్డ్ గా సరిగ్గా సెట్ అయ్యాడు. యాక్షన్ సన్నివేశాల్లో చాలా కష్టపడ్డాడు. హీరోయిన్ సాక్షి వైద్య లుక్స్ పరంగా ఆకట్టుకుంది. యాక్టింగ్ పరంగా ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. నాజర్, విమలా రామన్ లాంటి వాళ్లంతా తమ పాత్రల మేరకు నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు
టెక్నికల్ గా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ముఖేష్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ధర్మేంద్ర ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. రెండున్నర గంటల్లోపే సినిమాను ముగించాడు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించాడు. ప్రవీణ్ సత్తారు టేకింగ్ బాగుంది. ప్రతి సన్నివేశాన్ని స్టయిలిష్ గా తీశాడు. అయితే బలమైన కథ రాసుకోలేపోయాడు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కూడా మిస్సయ్యాడు.

న్యూస్ 360 తెలుగు రివ్యూ
స్టైలిష్ యాక్షన్ సినిమా తీసే ముందు స్ట్రాంగ్ పాయింట్ ఉండేలా చూసుకోవాలి. దాని చుట్టూ ఆసక్తిగా సాగే స్క్రీన్ ప్లే మీద వర్క్ చేయాలి. ఈ రెండు సెట్ అయితే స్టైలిష్ యాక్షన్ మూవీస్ తో సంచలనాలు సృష్టించొచ్చు. కానీ ఈ విషయంలో ప్రవీణ్ సత్తారు వెనకబడ్డాడు.

ప్రవీణ్ సత్తారు టాలెంటెడ్ డైరెక్టర్. తన స్టైలిష్ మేకింగ్ తో ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే దర్శకుడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ‘గరుడవేగ’. అందుకే ప్రవీణ్ సత్తారుకి ఆ తరహా స్టైలిష్ మూవీస్ తీయాలని నిర్మాతలు నుండి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. హీరోలు డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ‘గరుడ వేగ’ తర్వాత ప్రవీణ్ సత్తారు కంటెంట్ మీద ఫోకస్ తగ్గించి మేకింగ్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రవీణ్ తీసిన గత సినిమాలు చూస్తే ఇది క్లియర్ గా అర్థమవుతుంది.

గాండీవధారి అర్జున విషయానికొస్తే , ఇండియాలో జరుగుతున్న ఓ మంచి పాయింట్ తీసుకున్నాడు. కానీ దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. కథ చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకోలేదు. బలమైన సీన్స్ పడలేదు. హీరో కేరెక్టర్ కూడా తేలిపోయింది. ఈ తరహా సినిమాల్లో ప్రేక్షకులు ఆశించే స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. భారతదేశంలో పేరుకుపోతున్న వ్యర్థాల మీద సినిమా అంటే స్క్రిప్ట్ మీద ఎక్కువ వర్క్ చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా డాక్యుమెంటరీ అవుతుంది. ప్రవీణ్ సత్తారు విఫలం అయింది కూడా ఇక్కడే.

సినిమా చూస్తున్నంత సేపు ఏదో డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడా స్టైలిష్ ఫిలిమ్ మేకింగ్ , యాక్షన్ చూస్తే తప్ప సినిమా ఫీలింగ్ కలగదు. హీరో -మదర్ కి మధ్య సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవ్వలేదు. దీంతో ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వలేరు. హీరో -హీరోయిన్ మధ్య వచ్చే ట్రాక్ కూడా ఆకట్టుకోలేదు.

ప్రవీణ్ సత్తారు చెప్పాలనుకున్న వ్యర్థాల కాన్సెప్ట్ మంచిదే, కానీ ఈ సందేశంతో సినిమా చేయాలంటే స్క్రిప్ట్ మీద బోలెడంత వర్క్ చేయాలి. సినిమాకు తీసుకున్న పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం పక్కన పెడితే చూస్తున్నంత సేపు బోర్ కొడుతుంది. ఇలా కాకుండా ఎంగేజ్ చేసేలా తీసి ఉంటే బాగుండేది. వరుణ్ తేజ్ కి సెక్యూరిటీ ఆఫీసర్ రోల్ యాప్ట్ అనిపిస్తుంది, కానీ కేరెక్టర్ లో దమ్ము లేకపోవడంతో వరుణ్ అర్జున్ గా ఇంప్రెస్ చేయలేకపోయాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా తేలిపోయింది. ప్రీ క్లైమాక్స్ కి ముందు హీరో, డెడ్ బాడీ ఛేంజ్ ప్లాన్ కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. విలన్ ను పట్టుకునేందుకు ప్రయత్నించే హీరో సీన్స్ కూడా పేలవంగా ఉన్నాయి.

ఫైనల్ గా స్టైలిష్ యాక్షన్ మూవీగా థియేటర్స్ లోకి వచ్చిన ‘గాండీవ ధారి అర్జున’ ప్రేక్షకులను నిరాశ పరిచింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links