Friendship Day Special – టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ ను మరోసారి గుర్తుచేసుకుందాం.

మహేష్-ఎన్టీఆర్-రామ్ చరణ్ – టాలీవుడ్ ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ షిప్ బ్యాచ్ ఇది. ఈమధ్య కాలంలో టైమ్ సెట్ చేసుకొని మరీ కలుస్తున్నారు వీళ్లు. ప్రైవేట్ పార్టీలతో పాటు ఒకరి సినిమా ఫంక్షన్లకు మరొకరు ఎటెండ్ అవుతున్నారు. వీళ్లలో ఎన్టీఆర్-చరణ్ అయితే కలిసి సినిమా కూడా చేయబోతున్నారు.

రాజ్ తరుణ్-నిఖిల్ – పైకి పెద్దగా కనిపించరు కానీ వీళ్లు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. యంగ్ బ్యాచ్ లో రెగ్యులర్ గా మీట్ అయ్యేది వీళ్లిద్దరే. వీళ్లతోపాటు మిగతా హీరోలు జాయన్ అవుతారేమో కానీ, వీళ్లిద్దరు మాత్రం వారానికొకసారి కచ్చితంగా కలవాల్సిందే.

అడవి శేష్-రాహుల్ రవీంద్రన్ – సినిమాలు ఉన్నా లేకపోయినా వీళ్ల స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ కు సంబంధించి ఎప్పుడూ వీళ్లిద్దరి మధ్య హాట్ హాట్ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. రోజుకు ఒకసారైనా పలకరించుకోవాల్సిందే. రీసెంట్ గా వీళ్లిద్దరూ చేసిన గూఢచారి, చిలసౌ సినిమాలు రెండూ ఒకేరోజు విడుదలై సక్సెస్ అయ్యాయి

విజయ్ దేవరకొండ-సుధాకర్ – వీళ్లిద్దరూ మంచి స్నేహితులనే విషయం ఈమధ్యే బయటపడింది. సుధాకర్ హీరోగా నటించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ చిన్న రోల్ చేశాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయాడు. కానీ తన స్నేహితుడ్ని మాత్రం మరిచిపోలేదు. రీసెంట్ గా జరిగిన ఓ ఫంక్షన్ లో తమ ఫ్రెండ్ షిప్ గురించి వీళ్లిద్దరూ చక్కగా మాట్లాడుకున్నారు.

అల్లరినరేష్-నాని – నాని కంటే అల్లరినరేష్ సీనియర్. కానీ అలాంటి తేడాలు వీళ్ల మధ్య లేవు. బాబాయ్-బాబాయ్ అంటూ చక్కగా కలిసిపోతారు. ఏదో పైపైన మాట్లాడుకోవడం కాదు. ఇద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా కలిసిపోయారు. అది కూడా వీళ్ల ఫ్రెండ్ షిప్ ఈమధ్య స్టార్ట్ అయింది కాదు. చాన్నాళ్లుగా వీళ్లు మంచి దోస్తులు.

శ్రీకాంత్-శివాజీరాజా వీళ్లది దశాబ్దాల బంధం. స్ట్రగులింగ్ స్టేజ్ నుంచి కలిసి పైకొచ్చారు. శ్రీకాంత్ హీరోగా వరుసగా హిట్స్ కొడుతుంటే పొంగిపోయాడు శివాజీరాజా. సేమ్ టైం, శ్రీకాంత్ నటించిన చాలా సినిమాల్లో కనిపించేవాడు. ఇప్పటికీ వీళ్లిద్దరూ రోజూ కలుసుకుంటారు. అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు.

వీళ్లు కాకుండా, రెగ్యులర్ గా ఆడియన్స్ అందరికీ తెలిసిన బెస్ట్ ఫ్రెండ్స్ టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. వాళ్ల గురించి మనందరికీ తెలిసిందే.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400