మహదేవ్ నిందితుల బ్యాక్ గ్రౌండ్ బయటకొచ్చింది. బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దీనిని నడిపించే ప్రమోటర్స్ ఛత్తీస్ గడ్ కు చెందిన వారని ఈడీ విచారణలో తేలింది.
సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్లు ఈ యాప్ నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల కిందట సౌరభ్ జ్యూస్ షాపు నడపగా.. రవి ఓ టైర్ల షాపు నడిపాడు. ఓ దుబాయ్ షేక్, మరో పాక్ వ్యాపారవేత్తతో కలిసి వీరు మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రారంభించారు. కాగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మరో ఇద్దరు బాలీవుడ్ సెలబ్రెటీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. కమెడియన్ కపిల్ శర్మ, హీరోయిన్ శ్రద్ధా కపూర్, నటి హుమా ఖురేషీకి సమన్లు జారీ చేసింది.
విచారణకు హాజరుకావాలని సూచించింది. కాగా ఇదే కేసులో స్టార్ హీరో రణబీర్ కపూర్ కు కూడా నోటీసులు ఇచ్చిన ఈడీ.. విచారణకు హాజరుకావాలని పేర్కొంది. అయితే తనకు 2 వారాల గడువు కావాలని రణబీర్ కోరాడు.