Home » Dil Raju – మహేష్-ప్రభాస్-దిల్ రాజు

Dil Raju – మహేష్-ప్రభాస్-దిల్ రాజు

by admin
0 comment

కరోనా తర్వాత దిల్ రాజు స్పీడ్ తగ్గించాడు. సినిమాల విషయంలో ట్రాక్ తప్పాడు. కోలీవుడ్ హీరోతో తెలుగు స్ట్రయిట్ సినిమా చేశాడనే అపవాదును కూడా ఎదుర్కొన్నాడు. త్వరలోనే మళ్లీ ట్రాక్ లోకి వస్తానంటున్నాడు ఈ టాప్ ప్రొడ్యూసర్. ఈ సందర్భంగా తన సినిమా లైనప్ ఎనౌన్స్ చేశాడు. ప్రభాస్ తో సినిమా లాక్ చేశాడు దిల్ రాజు. ప్రస్తుతం సలార్ చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ ను మరోసారి దిల్ రాజు రిపీట్ చేయబోతున్నాడు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే ఏడాది సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు.

ప్రభాస్ తో పాటు ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు దిల్ రాజు. ప్రస్తుతం తారక్ చేతిలో 2 సినిమాలున్నాయని, ఆ కమిట్ మెంట్స్ పూర్తయిన వెంటనే తన బ్యానర్ లో సినిమా ఉంటుందని తెలిపాడు. ఎన్టీఆర్, ప్రభాస్ తో పాటు.. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ తో కూడా సినిమాలు చేయబోతున్నట్టు తెలిపాడు. రాజమౌళితో మహేష్ బాబు సినిమా పూర్తయిన తర్వాత, తన సినిమానే ఉంటుందని తెలిపిన దిల్ రాజు.. పవన్ కల్యాణ్ తో కూడా మరో సినిమా చేయబోతున్నట్టు స్పష్టం చేశాడు.

ప్రస్తుతం ఈ నిర్మాత, బలగం సినిమా సక్సెస్ తో హుషారుగా ఉన్నాడు. అయితే ఆ ఉత్సాహాన్ని శాకుంతలం సినిమా నీరుగార్చింది. సమంత లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాతో దిల్ రాజుకు దాదాపు 22 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. ఇకపై ఇలాంటి రిస్కులు చేయకుండా, పూర్తిగా పెద్ద హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు రాజు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links