ఇకపై ఓటీటీలో ధూం..ధాం

నాని హీరోగా నటించిన తాజా చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ, భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల మధ్య నాని చేసిన ఈ సినిమా నైజాంలో పెద్ద హిట్టయింది. ఆంధ్రా, సీడెడ్ లో ఆశించిన స్థాయిలో అంచనాల్ని అందుకోలేకపోయింది. ఈ సంగతి పక్కనపెడితే, నాని పెర్ఫార్మెన్స్ కు అంతా ఫ్లాప్ అయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోల్ని సైతం నాని మెస్మరైజ్ చేశాడు. ప్రభాస్, మహేష్, చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి ఎంతోమంది స్టార్లు నాని నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. అలా 3 వారాల పాటు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిన దసరా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. మరో వారం రోజుల్లో, అంటే ఏప్రిల్ 27న ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు.

ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఘనంగా ప్రకటించింది. అంతేకాదు, ప్రత్యేకంగా ట్రయిలర్ కూడా కట్ చేసి విడుదల చేసింది. ఈ మూవీతో తెలుగులో మరోసారి సబ్ స్క్రిప్షన్ బేస్ పెంచుకోవాలని భావిస్తోంది ఆ సంస్థ

భారత్ లో సబ్ స్క్రిప్షన్ ఫీజు భారీగా తగ్గించింది నెట్ ఫ్లిక్స్. ఈ సంస్థ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిచ్చింది. దీంతో మరిన్ని దేశాల్లో ఇదే పద్ధతిని ప్రవేశపెట్టబోతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వినియోగదారుల సంఖ్య తగ్గకూడదు. మరీ ముఖ్యంగా వ్యూయింగ్ మినిట్స్ కూడా తగ్గకూడదు. అందుకే ఆచితూచి సినిమాల్ని ఎంపిక చేసుకుంటోంది.

ఇందులో భాగంగా దసరా సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ మొత్తానికి దక్కించుకుంది ఈ సంస్థ. సినిమా ఓటీటీలో క్లిక్ అయితే, మరిన్ని తెలుగు సినిమాల రైట్స్ ను తీసుకునే దిశగా ఆలోచిస్తోంది నెట్ ఫ్లిక్స్.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400