Custody – మరో ‘శివ’ అవుతుందా?

బహుశా నాగచైతన్య కెరీర్ లో ఏ సినిమాకు ఇంత హైప్ వచ్చి ఉండదు. ఇప్పటివరకు నాగచైతన్య నటించిన ఏ సినిమా కోసం ఆడియన్స్ ఇంతలా వెయిట్ చేయలేదు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి నాగచైతన్య నిలకడగా హిట్స్ ఇస్తున్నాడు. ఇక రెండోది తాజా చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. అందుకే కస్టడీపై అందరి చూపు పడింది.

పైగా ఇది ఓ మోస్తరు యాక్షన్ సినిమా కూడా కావడంతో శివ సినిమాతో కంపారిజన్ మొదలైంది. నాగార్జునకు శివ సినిమా ఓ టర్నింగ్ పాయింట్. కెరీర్ స్టార్టింగ్ లో శివ సినిమా పడకపోతే నాగ్ కెరీర్ మరో విధంగా ఉండేదేమో. అలాంటి సినిమా ఒకటి చైతూ కెరీర్ లో కూడా పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మజిలీ, లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చినప్పటికీ, మాస్-యాక్షన్ ఉండే శివ లాంటి సినిమా చైతూకు పడలేదు.

ఆ లోటు కస్టడీతో తీరిపోతుందని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే, ఈ సినిమా ట్రయిలర్ అంత క్లిక్ అయింది మరి. యాక్షన్, మాస్ సినిమాలు చేసిన ప్రతిసారి బోల్తాపడ్డాడు నాగచైతన్య. ఆటోనగర్ సూర్య, దడ లాంటి ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని రుజువుచేశాయి. ఇప్పుడు కస్టడీ వస్తోంది.

అలా అని ఇది పూర్తిస్థాయి యాక్షన్-మాస్ మూవీ కాదని అంటున్నాడు నాగచైతన్య. అయినప్పటికీ చైతూ గన్ పట్టుకున్నాడు కాబట్టి యాక్షన్ మూవీ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. దీనికితోడు ఇళయరాజా-యువన్ శంకర్ కలిసి సంగీతం అందించడం ఈ సినిమాపై అంచనాలు పెంచింది. మరీ ముఖ్యంగా నాగచైతన్య-కృతిషెట్టిది హిట్ పెయిర్. దీంతో కస్టడీకి అన్నీ పాజిటివ్ సెంటిమెంట్స్ కనిపిస్తున్నాయి.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400