ప్రతి హీరోహీరోయిన్‌కు ప్రత్యేకంగా కొన్ని టేస్టులున్నాయి. ఉదాహరణకు మహేష్ నే తీసుకుంటే మునక్కాయ-మటన్ ఈ హీరో ఆల్ టైమ్ ఫేవరెట్. ప్రభాస్ కైతే బిర్యానీ. అలాగే మిగతా హీరోలు, హీరోయిన్లు ఏ వంటకాలు ఎక్కువగా ఇష్టపడతారో తెలుసా.. లెట్స్ హేవ్ ఏ లుక్..
మహేష్ బాబు (Mahesh babu) ఆల్ టైమ్ ఫేవరెట్ మునక్కాయ-మటన్ కర్రీ. మరీ ముఖ్యంగా ఈ కర్రీని వాళ్ల అమ్మగారు చేస్తే మరీ ఇష్టం. ఇది కాకుండా హైదరాబాదీ బిర్యానీ అంటే కూడా మహేష్ కు ఇష్టమే.
ప్రభాస్ భోజనప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. ఇతడికి ఇష్టమైన వంటకం బిర్యానీ. ఒక్కోసారి 15 రకాల బిర్యానీలు తెప్పించుకొని మరీ లాగించేసిన సందర్భాలున్నాయి. దీంతో పాటు ఇంట్లో చేసే నెయ్యి తొక్కుడు పచ్చడి అంటే ప్రభాస్ కు బాగా ఇష్టం.
తనకు ఏదిష్టమో ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు ఎన్టీఆర్. వాళ్ల అమ్మ చేసిన రొయ్యల బిర్యానీ అంటే తారక్ కు తెగ ఇష్టం. దీంతో పాటు అమ్మ చేసే నాటుకోడి కూర, నాటుకోడి వేపుడు కూడా ఎన్టీఆర్ కు ఇష్టం. వీటి తర్వాతే ఏ రుచులైనా.
నిఖిల్ ఎక్కువగా ఇంట్లో చేసిన వంటకాలే ఇష్టపడతాడు. బయట భోజనం అయితే మాత్రం గుంటూరులోని బిలాల్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
రష్మికకు పంది మాంసం అంటే చాలా ఇష్టం. నిజానికి తన ప్రాంతంలో అది సంప్రదాయ వంటకం. బార్బెక్యూ పోర్క్, అంటే కాల్చిన పందిమాంసంతో 2 పెగ్గులు వైన్ తాగితే స్వర్గం చూడొచ్చని చెబుతోంది ఈ బ్యూటీ. రష్మిక ఇంట్లో రెగ్యులర్ గా పోర్క్ తో చేసిన సంప్రదాయ వంటకాలు ఉంటాయి. అంతేకాదు.. వైన్ కూడా ఇంట్లోనే తయారుచేసుకుంటారు వీళ్లు.
ఒకప్పుడు చికెన్, చేప లేకపోతే సమంతకు ముద్ద దిగేది కాదు. మరీ ముఖ్యంగా సాల్మన్ చేపతో చేసిన వంటకాలు బాగా ఇష్టం. వీటికి తోడు బిర్యానీ కూడా. ప్రతి రోజూ బిర్యానీ తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చాన్నాళ్లుగా నాన్-వెజ్ మానేసింది. అన్నంతో పాటు అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు తింటోంది.
కాజల్ నార్త్ ఇండియన్ అయినప్పటికీ, ఆంధ్రా వంటకాలంటే చాలా ఇష్టం. బెండకాయ పులుసు, సొరకాయ పచ్చడి, పెసరట్టు ఈమె హాట్ ఫేవరెట్. వీటితో పాటు అప్పుడప్పుడు బోర్ కొడితే ఇటాలియన్ రుచులు టేస్ట్ చేస్తుంది ఈ చందమామ.
పూజా హెగ్డే హాట్ ఫేవరెట్ మటన్ బిర్యానీ. రకరకాల బిర్యానీలు తినడమే కాదు, ఈమెకు చేయడం కూడా వచ్చు. ప్రభాస్ కు కూడా బిర్యానీ అంటే ఇష్టం. దీంతో ఇద్దరూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త బిర్యానీలు టేస్ట్ చేసేవారు. తను ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఎలాంటి కండిషన్ లో ఉన్నప్పటికీ, పక్కన ప్రభాస్ ఉంటే, అక్కడ బిర్యానీ ఉంటుందని చెబుతోంది పూజా హెగ్డే.
రకుల్ కు కాస్త ఫిట్ నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆమెకు ఇష్టమైన ఆహారం కూడా అలానే ఉంటుంది. పాత కాలంలో అమ్మమ్మలు చేసే వెజిటేరియన్ వంటకాలు తనకు చాలా ఇష్టం అంటోంది రకుల్.
లావణ్య త్రిపాఠికి ఇష్టమైన వంటకం అన్నం-పప్పు. వేడివేడిగా ఈ రెండు వడ్డిస్తే చాలు లొట్టలేసుకొని లాగించేస్తానంటోంది. దీనికి కాస్త ఏదైనా చట్నీ తోడైతే ఇంకా బెటర్ అంటోంది. దీంతో పాటు పాలు తక్కువ వేసి చేసే టీ అంటే కూడా ఇష్టమట.
నివేత పెతురాజ్ ది ఓ డిఫరెంట్ టేస్ట్. ఈమెకు నచ్చిన వంటకాలన్నీ ఒకే ఒక్క చోట దొరుకుతాయట. అదే అమ్మా మెస్. మధురైలో ఉన్న ఈ అమ్మ మెస్ లోని వంటకాలంటే చాలా ఇష్టమంట. ఇవి కాకుండా మసాలా ఉండలు, వైట్ సాస్ పాస్తా అంటే కూడా ఈమెకు ఇష్టం.
పాయల్ ను భోజనాన్ని వేరుచేసి చూడలేం. పొద్దున లేవడమే ఏం తిందామా అనే ఆలోచనతో లేస్తుందట. పిజ్జా, దోశలు ఎక్కువ ఇష్టంగా తింటుంది. పంజాబీ కాబట్టి రాజ్మా రైస్ కూడా ఇష్టమే. పక్కా వెజిటేరియన్ కాబట్టి వెజ్ లో ఉండే రకాలన్నీ ట్రై చేస్తానంటోంది పాయల్.
ఇలియానాకు ఢిల్లీలో రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆ వాతావరణానికి, అక్కడి ఫుడ్ చాలా బాగుంటుందని అంటోంది. మసాలా తక్కువగా ఉండే వంటకాలు ఏవైనా ఇలియానాకు ఇష్టమే. వీటితో పాటు గోవా సంప్రదాయ రుచులన్నా ఈ బ్యూటీకి చాలా ఇష్టం.