CAPTAIN MILLER
Home » Dhanush: కెప్టెన్‌ మిల్లర్‌ టీజర్‌ అదిరింది

Dhanush: కెప్టెన్‌ మిల్లర్‌ టీజర్‌ అదిరింది

by admin
0 comment

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ హైబడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. 2023లో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ 1930-40ల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధా ర్ధ సహ-నిర్మాతలు. ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర నిర్మాతలు టీజర్ విడుదల చేశారు.

హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ కి హీరో సందీప్ కిషన్‌తో పాటు 500 మందికి పైగా అభిమానులు హాజరయ్యా రు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. కెప్టెన్ మిల్లర్ ను తనకు ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సందీప్ కిషన్.. త్వరలోనే ధనుష్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు బ్రేకింగ్ న్యూస్ వెల్లడించాడు.

ఇక టీజర్ విషయానికొస్తే, డకాయిట్, హంతకుడుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్ ను పట్టుకోవడానికి ప్రకటించిన భారీ రివార్డ్ నోట్ తో ఆసక్తికరంగా టీజర్ ప్రారంభమవుతుంది. ధనుష్ లుక్, గెటప్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బ్రిటిషర్లను ధనుష్ చీల్చి చెండాడుతున్న దృశ్యాలు, చేతిలో గన్ పట్టుకున్న సీన్ బాగా ఎలివేట్ అయ్యాయి. హీరోయిన్ ప్రియాంక మోహన్ తో పాటు, కీలక పాత్ర పోషించిన శివరాజ్ కుమార్ ను కూడా టీజర్ లో చూపించారు. టీజర్ కు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. ధనుష్ కెరీర్ లోనే విలక్షణ చిత్రంగా నిలవనుంది కెప్టెన్ మిల్లర్.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links