ప్రస్తుతం ఖరీదైన కూరగాయ ఇదే!

మార్కెట్లో కాస్ట్ లీ వెజిటబుల్ ఏదంటే, వెంటనే వచ్చే సమాధానం టమాట. కొన్ని ప్రాంతాల్లో కేజీ 300 రూపాయల రేటు కూడా పలుకుతోంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఖరీదైన కూరగాయ టమాట కాదు. దీన్ని మించిన రేటు పలుకుతోంది మరో వెజిటబుల్. దాని పేరు బోడకాకర.

వర్షాకాలంలో మాత్రమే దొరికే వెజిటబుల్ ఇది. ఈ సీజన్ కు సంబంధించి కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది బోడకాకర. దీని ధర అటుఇటుగా కిలోకు 350 రూపాయల నుంచి 400 రూపాయలు పలుకుతోంది. వరంగల్ మార్కెట్లో బోడకాకర కేజీ 400 రూపాయల పైమాటే ఉంది. ఇటు హైదరాబాద్ లో కూడా దీని ధర దాదాపు ఇంతే ఉంది.

బోడకాకర సాగు తక్కువ. ఒకప్పుడు అటవీ ప్రాంతాల్లో మాత్రమే దొరికే ఈ కూరగాయను ఇప్పుడు కొంతమంది ప్రత్యేకంగా పండిస్తున్నారు. వీటిలో హైబ్రిడ్ రకం కూడా వచ్చింది. అయినప్పటికీ మార్కెట్లో తగినంత లభ్యత లేకపోవడంతో బోడకాకర ధర చుక్కల్ని తాకుతోంది.

టమాట, పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి ధరలు మండిపోతున్నాయి. త్వరలోనే ఈ లిస్ట్ లోకి ఉల్లిగడ్డ కూడా చేరుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు వీటన్నింటినీ మంచి బోడకాకర మండిపోతోంది.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400