మనకి హద్దుల్లేవ్..సరిహద్దుల్లేవ్.. ఆల్ ఏరియాస్ మనవే. భోళాశంకర్ లో చిరంజీవి చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఇది. కొద్దిసేపటి కిందట భోళాశంకర్ టీజర్ రిలీజైంది. చిరంజీవి శ్వాగ్ కనిపించింది. 33 మందిని చంపాడనే డైలాగ్ తో, ఓ యాక్షన్ ఎపిసోడ్ తో టీజర్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేశారు.
టీజర్ లో చిరంజీవి యాక్షన్ లుక్ అదిరింది. దీంతో పాటు చిరు కామెడీ టైమింగ్ ను, అద్భుతమైన డెైలాగ్ డెలివరీని కూడా టీజర్ లో చూడొచ్చు. ఈ సినిమాలో తెలంగాణ యాసలో చిరంజీవి డైలాగ్ చెప్పారు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది భోళాశంకర్ సినిమా. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో తమన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేశ్, కీలక పాత్రలో సుశాంత్ కనిపించనున్నారు. వీళ్లకు కూడా టీజర్ లో చోటు దక్కింది.
ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తున్నాడు భోళా. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.