Home » Bhagavanth Kesari – కలిసి డాన్స్ చేసిన కాజల్, శ్రీలీల

Bhagavanth Kesari – కలిసి డాన్స్ చేసిన కాజల్, శ్రీలీల

by admin
0 comment

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి కూడా ఒకరు. కమర్షియల్ కథలకు కామెడీ టచ్ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఇటీవల ‘ఎఫ్3’ మూవీతో సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రీసెంట్ గా బాలయ్య మూవీ సెట్స్ లో అనిల్ రావిపూడి, డాన్స్ మాస్టర్లతో కలిసి బాలయ్య పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.

ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఇదే టైపులో మరో వీడియో రిలీజ్ చేశారు. తాజా వీడియోలో అనిల్ రావిపూడి కాకుండా, హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీ లీల బాలయ్య సూపర్ ‘హిట్ సాంగ్ ‘చిలకపచ్చ కోక’ పాటకి అదిరిపోయే స్టెప్పులు వేశారు. మధ్యలో దర్శకుడు అనీల్ రావిపూడి కూడా కనిపించడం విశేషం.

ఈ వీడియోని తన సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి షేర్ చేస్తూ.. “నేను బాలయ్య బాబు పాటకి వేసిన డాన్స్ కు ఈర్ష్యగా ఫీల్ అవుతూ మా హీరోయిన్స్ ఇద్దరూ నా ముందు డాన్స్ చేయడం అస్సలు ఆపడం లేదు” అంటూ రాసుకొచ్చాడు. సాంగ్ లో కాజల్, శ్రీలీల ఒకే రకమైన దుస్తులు ధరించి తమ డాన్స్ తో ఇరగదీశారు.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links