balakrishna thaman
Home » NBK Thaman – సూపర్ హిట్ కాంబినేషన్ లోడింగ్

NBK Thaman – సూపర్ హిట్ కాంబినేషన్ లోడింగ్

by admin
0 comment

నందమూరి బాలకృష్ణ.. ఈ హీరో ఎవర్నయినా నమ్మితే ఇక వదలరు. వరుసపెట్టి అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు తమన్ కు ఆ అదృష్టం వరించింది. ఎప్పుడైతే అఖండ సినిమా హిట్టయిందో, అందులో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్లిక్ అయిందో, ఇక అక్కడ్నుంచి తమన్ కు వరుసపెట్టి అవకాశాలిస్తున్నారు బాలయ్య.

తాజాగా భగవంత్ కేసరి సినిమా టీజర్ రిలీజైంది. ఈ టీజర్ కు కూడా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు తమన్. దీంతో బాలయ్య-తమన్ కాంబో ఫిక్స్ అయిపోయింది. భగవంత్ కేసరి కూడా హిట్టయితే.. వీళ్లది సూపర్ హిట్ కాంబినేషన్ గా మారిపోవడం ఖాయం. వీళ్ల కాంబో ఇక్కడితో ఆగలేదు. త్వరలోనే బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య.

ఆ మూవీకి కూడా తమనే సంగీతం అందించబోతున్నాడు. ఆ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబోలో సినిమా ఉంటుంది. ఈ మూవీకి ఎలాగూ తమనే సంగీతం అందిస్తాడనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలా బాలయ్య నుంచి రాబోతున్న ప్రతి సినిమాకు తమనే సంగీతం అందిస్తూ వస్తున్నాడు.

బాలయ్య ఇమేజ్, అతడి మేనరిజమ్, తెరపై యాక్షన్ కు సరిగ్గా సూట్ అయ్యే మ్యూజిక్ ను తమన్ అందిస్తున్నాడు. నిజానికి బాలయ్య-తమన్ కలిసి పనిచేయడం అఖండతోనే మొదలుకాలేదు. చాలామంది అఖండ సినిమాతోనే వీళ్లు కలిశారని అనుకుంటున్నారు. తమన్ కు డిక్టేటర్ సినిమాతో ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత అఖండతో మరోసారి బాలయ్య సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్న తమన్, ఇక అక్కడ్నుంచి నటసింహాన్ని మెప్పించడం మొదలుపెట్టాడు.

బాలయ్య కూడా తమన్ తప్ప మరో ఆప్షన్ గురించి ఆలోచించడం లేదు. భగవంత్ కేసరి సినిమాకు కూడా తమన్ ను తీసుకోమని, దర్శకుడు అనీల్ రావిపూడికి చెప్పింది బాలకృష్ణే.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links