కనిపించే శత్రువుతో పోరాటం కంటే.. మనిషిలోని కనిపించని శత్రువుతో పోరాటం ఇంకా కష్టం. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉండే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలతో పోరాటమే అరి సినిమా. ‘అరి’షడ్వర్గాలు మనిషి పతనానికే కాకుండా ప్రకృతి వినాశనానికి దారితీస్తుంటాయి. ఇలాంటి విభిన్న కథాశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే ‘అరి’.
ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. దీంతో పాటు.. మంగ్లీ పాడిన ‘చిన్నారి కిట్టయ్య’ సాంగ్‌కి అనూహ్య రీతిలో స్పందన లభించింది. కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు.
తాజాగా ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్) బెంగళూరు ప్రెసిడెంట్ మధు పండిట్ దాస.. ‘అరి’ చిత్ర దర్శకుడు జయ శంకర్‌ని అభినందించారు. కృష్ణ తత్వాన్ని ప్రభోదిస్తూ ‘అరి’ చిత్రాన్ని రూపొందించడంపై చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు.
అంతకుముందు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ‘అరి’ చిత్ర ట్రైలర్, ‘చిన్నారి కిట్టయ్య’ సాంగ్ చూసి అభినందనలు తెలియజేశారు.
సాయికుమార్, సుభలేఖ సుధాకర్, అనసూయ, శ్రీకాంత్ అయ్యర్, సురభి ప్రభావతి, వైవా హర్ష ఈ ఆరుగురు ఆరు ఇంపార్టెంట్స్ రోల్స్‌లో కనిపించారు. వీరితో పాటు సుమన్, ఆమని, చమ్మక్ చంద్ర, శ్రీనివాస రెడ్డి ఇతర పాత్రల్లో కనిపించారు. త్వరలోనే ప్రేక్షకులముందుకొస్తున్న ఈ సినిమాను శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డిలు నిర్మించారు.