Anasuya – శాంతించిన అనసూయ

యాంకర్ అనసూయ శాంతించింది. విజయ్ దేవరకొండపై పరోక్షంగా విమర్శలు చేసిన ఈ నటి గడిచిన 24 గంటలుగా సోషల్ మీడియాలో స్తబ్దుగా మారింది. దీంతో తాజా వివాదం సద్దుమణిగినట్టు కనిపిస్తోంది. అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా అనసూయపై తమ విమర్శల జడివాన తగ్గించారు.

ఖుషి సినిమా పోస్టర్ లో “ది విజయ్ దేవరకొండ” అనే టైటిల్ పడింది. ఇలా పేరుకు ముందు ది అనే పదాన్ని వాడడాన్ని అనసూయ తప్పుబట్టింది. పైత్యం ఎక్కువైందని, మనకు అంటకుండా జాగ్రత్తపడాలంటూ సెటైర్లు వేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అనసూయను అంటీ అని, అసూయ అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో కొన్ని అభ్యంతరకర పదజాలాన్ని కూడా వాడారు కొంతమంది. వాటిని అనసూయ స్వయంగా పోస్ట్ చేసింది. హీరోలకు బాధ్యత లేదా, ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయరా అంటూ మిగతా హీరోలందర్నీ ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేసింది. అయితే ఈ వివాదంపై మిగతా హీరోల ఫ్యాన్స్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు.

దీంతో అనసూయ కూడా ఈ వివాదాన్ని లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. గడిచిన 24 గంటలుగా ఆమె ట్విట్టర్ లో ఎలాంటి ట్వీట్లు పెట్టలేదు. వివాదంతో సంబంధం లేని, ఓ పాత వీడియోను మాత్రం షేర్ చేసి ఊరుకుంది.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400