Anasuya – రోజుకో ట్వీట్, ప్రతి రోజూ రచ్చ

అనసూయకు వివాదాలు కొత్త కాదు. నిత్యం ఆమె వివాదాల మధ్య జీవిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెపై జరిగే ట్రోల్స్ అన్నీఇన్నీ కావు. కొన్ని వివాదాల్ని ఏరికోరి మొదలుపెడుతుంది అనసూయ. ఈమధ్య మొదలైన వివాదం కూడా అలాంటిదే.

ఖుషి సినిమా పోస్టర్ లో విజయ్ దేవరకొండ తన పేరుకు ముందు ‘ది’ అనే అక్షరాన్ని తగిలించుకున్నాడు. దీన్ని అనసూయ పరోక్షంగా విమర్శించింది. ఈ పైత్యం మనకు అంటకుండా జాగ్రత్తపడాలంటూ చురకలు అంటించింది. దీనిపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అనసూయను నానా మాటలు అన్నారు. కొంతమంది హద్దులుదాటి విమర్శలు చేశారు.

దీంతో ఈ వివాదంపై తనదైన వివరణ ఇచ్చి ఊరుకుంది అనసూయ. అక్కడితో ఆ వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ అనసూయ మాత్రం ఊరుకోలేదు. ఈ అంశంపై రోజుకో ట్వీట్ వేస్తోంది. ప్రతి రోజూ వార్తల్లో నలుగుతోంది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి మీడియాకు చురకలు అంటించింది అనసూయ.

దీంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. తాజాగా ఈ వ్యవహారంలోకి రాహుల్ రామకృష్ణ కూడా ఎంటర్ అవ్వడంతో.. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకెన్ని రోజులు ఈ వివాదం నలుగుతుందో చూడాలి.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400