akhil agent
Home » Agent – జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్

Agent – జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్

by admin
0 comment

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది ఏజెంట్ మూవీ. అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. అనీల్ సుంకర నిర్మించారు. సాక్షి వైద్య ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది.

అఖిల్ కు కెరీర్ లో ఇది 5వ సినిమా. ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయిన ఈ అక్కినేని హీరో, ఏజెంట్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాకు జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ సాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతోపాటు.. బెంగళూరు, చెన్నైలో కూడా ఏజెంట్ సినిమాకు బుకింగ్స్ నడుస్తున్నాయి.

అటు మలయాళం వెర్షన్ కూడా రిలీజ్ కు సిద్ధమైంది. తెలుగు, మలయాళ వెర్షన్లు రిలీజ్ అయిన తర్వాత.. హిందీలో ఈ సినిమాను విడుదల చేస్తారు. ఈ సినిమాలో మమ్ముట్టి నటించడమే పెద్ద వండర్ అంటోంది యూనిట్. ఎందుకంటే, కంటెంట్ బాగాలేకపోతే మమ్ముట్టి నటించరు.

దశాబ్దాల కెరీర్ లో ఇప్పటివరకు కేవలం 3 తెలుగు సినిమాలు మాత్రమే చేశారు మమ్ముట్టి. ఏజెంట్ సినిమా ఆయనకు నాలుగో టాలీవుడ్ మూవీ. దీన్ని బట్టి ఏజెంట్ కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links