adipurush
Home » Adipurush Trailer – మరో 3 రోజుల్లో ట్రయిలర్

Adipurush Trailer – మరో 3 రోజుల్లో ట్రయిలర్

by admin
0 comment

2023లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి ఆదిపురుష్. జూన్ 16న ఈ సినిమా విడుదలవుతోంది. ఇప్పుడీ సినిమా మరో 3 రోజుల్లో.. అంటే 9వ తేదీన చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు.

ఆదిపురుష్ ట్రయిలర్ ను ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలలో ప్రదర్శించబోతున్నారు. టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ ఫిలిం హిస్టరీకి సంబంధించి ఇదే అతి పెద్ద గ్లోబల్ ఈవెంట్‌. భారతదేశంలోనే కాకుండా, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌తో సహా USA, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా, దక్షిణాసియాలోని దేశాల్లో ఈ ట్రయిలర్ ను ప్రదర్శిస్తారు. ఆఫ్రికా, బ్రిటన్, యూరోప్ దేశాలు, రష్యా, ఈజిప్ట్ లో కూడా ఈ ట్రయిలర్ ను చూపిస్తారు. ఇంకా చెప్పాలంటే, భారతీయులు ఉన్న ప్రతి దేశంలో ఆదిపురుష్ ట్రయిలర్ ను ప్రదర్శిస్తారు.

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్‌ కు ఎంపికైంది. తెలుగులో యూవీ క్రియేషన్స్ సహకారంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమాలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links