Adipurush – ప్రతి రామాలయానికి వంద టిక్కెట్లు

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ప్రభాస్ నటించిన ఆది పురుష్. ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకిగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణ్ గా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఘనంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మేకర్స్, దర్శకుడు కలిసి ఈమధ్య ఓ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అదేమిటంటే “రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటికి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం, ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ఆది పురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి ధియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ఈ మంచి కార్యాన్ని మరింత ప్రోత్సాహిస్తూ, టాలీవుడ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ శ్రేయస్ మీడియా మరో నిర్ణయం తీసుకుంది.

ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి చెరో 101 టికెట్లను ఉచితంగా ఇవ్వాలని ఈ సంస్థ నిర్ణయించింది. వీటిలో 100 టికెట్లు రామాలయంకు, మిగిలిన ఒక టికెట్ ను హనుమంతుడికి కేటాయించారు. అంటే ఆ టికెట్ లో సీట్ ను ఖాళీగా ఉంచేస్తారన్నమాట. ఇలా ఎన్ని రామాలయాలుంటే, అన్ని ఆలయాలకు 101 టిక్కెట్లు పంచాలని నిర్ణయించారు. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు, రామాయణం అందరికీ ఆదర్శం. ఆ ఇతిహాసాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో, ఈ నిర్ణయం తీసుకుంది శ్రెయాస్ మడియా.

టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు రైట్స్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దక్కించుకుంది. ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తయింది. 3 గంటల నిడివి ఉన్న ఈ సినిమాకు క్లీన్-యు సర్టిఫికేట్ దక్కింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుపై స్పష్టత వచ్చిన వెంటనే ఆదిపురుష్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతాయి.

Related posts

RGV తర్వాత ‘సందీప్‌రెడ్డి’నే- రాజమౌళి

చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

యానిమల్‌ టికెట్‌ ధర రూ.2400