ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బిగ్ అప్‌డేట్. శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), శారీరక సామర్థ్య పరీక్ష(పీఈటీ)లకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తాజా ప్రకటనలో వెల్లడించింది. జులై 21 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3 సాయంత్రం 5 గంటల వరకు ఎస్సై(సివిల్), రిజర్వ్ ఎస్సై(ఏపీఎస్సీ) అభ్యర్థుల పీఎంటీ/ పీఈటీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ జరుగనుంది. అభ్యర్థులందరూ సంబంధిత ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సూచించింది.
స్టేజ్-2కు ఎంపికైన అభ్యర్థులు టెన్త్, డిగ్రీ సర్టిఫికేట్లు, కుల, స్థానిక ధ్రువీకరణ పత్రాలు పోలీస్ నియమాక మండలి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రంగా జరగనున్నాయి. కాగా, 411 ఎస్సై పోస్టులకు గతేడాది నవంబర్‌లో నోటీఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ప్రాథమిక పరీక్ష నిర్వహించగా 57,923 మంది తదుపరి ప్రక్రియకు అర్హత సాధించారు.