తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’ (TS TET-2023) ప్రకటనను మంగళవారం విడుదల చేసింది. దీనికి ఉపాధ్యాయ నియామక పరీక్షలో వెయిటేజీ ఉంది. అభ్యర్థులు పేపర్-1, పేపర్-2లో అర్హత సాధించాల్సి ఉంటుంది. పేపర్‌ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ/ లాంగ్వేజ్ పండిట్/ యూజీడీపీఈడీ/ డీపీఈడీ/ బీపీఈడీ లేదా తత్సమానం అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులు కూడా అర్హులే. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 15న పరీక్ష జరగనుంది. అదే నెల 27న ఫలితాలు విడుదల చేస్తారు.