గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు వాయిదా

తెలంగాణలో తొలిసారిగా విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు మరో అంతరాయం కలిగింది. జూన్‌లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ మంగళవారం జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.

కాగా, పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసిన టీఎస్‌పీఎస్‌సీ వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. సోమవారం అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారని తెలిపింది. దీంతో అప్పటివరకు గ్రూప్‌-1 ఫలితాలు ఇవ్వబోమని హైకోర్టుకు వెల్లడించింది. ప్రశ్నపత్రాల లీకేజ్‌ వ్యవహారంతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రెండో సారి జూన్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..