సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

ఉద్యోగాలిప్పిస్తాం.. ట్రాన్స్‌ఫర్లు చేయిస్తాం.. ప్రభుత్వంలో ఏ పనైనా ఇటే చేప్పిస్తామంటూ అమాయకుల వద్ద నుంచి సుమారు రూ.70 కోట్లు వసూళ్లు చేసిన సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ ఏడాది కాలంగా ఎలా తప్పించుకుతిరుగుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గ్రూప్‌–1 అధికారినంటూ చెబుతూ సెక్రటరీయెట్‌ ముందు పెద్ద డ్రామా చేసిన బ్లప్‌ మాస్టర్‌ పోలీసులకు చిక్కకపోవడానికి కారణం ఏందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఫోన్‌ నెంబర్లు మారుస్తూ ఎప్పటికప్పుడు పోలీసులను బురిడీ కొట్టిస్తున్న ఈ మాయగాడికి సమాచారం ఎలా వస్తుందనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లోనే చర్చగా మారింది. అత్యంత గోప్యంగా సాగే విచారణ వివరాలు ఎప్పటికప్పుడు హరికిషన్‌దాస్‌కు తెలవడం, కొత్త నెంబర్‌ దొరక్కగానే వెంటనే అది పనిచేయకపోవడం వెనుక ఎవరో అతనికి సహకారం అందిస్తున్నారనేది ప్రశ్నగా మారింది.
సీడీఆర్‌లు ఎన్ని తీసినా వెంటనే నెంబర్‌ మాయం..?
ఎవరైనా పరారీలో ఉన్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు తొలుత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటారు. అందులో బాగంగా నిందితుడికి సన్నిహితులకు సంబందించిన ఫోన్‌ నెంబర్లపై నిఘా వేస్తుంటారు. అయితే బాగ్యనగరం చుట్టుపక్కనే సంచరిస్తున్న హరికిషన్‌ దాస్‌ తరుచూ నెంబర్లు మార్చడం వెనుక అనేక అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు సీడీఆర్‌ తీయడం, అతనికి సంబందించిన నెంబర్‌ ట్రేస్‌ అవుట్‌ చేసి పట్టుకుందానేలోపే అతను ఆ నెంబర్‌ తీయడం చూస్తే విచారణకు సంబందించిన వివరాలు హరికిషన్‌దాస్‌కు ఎవరో చేరవేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త నెంబర్‌ కనుక్కొని అతనిని పట్టుకుందామనే లోపే ఆ నెంబర్‌ మాయం కావడం చూస్తే అతనికి ఎవరు సమాచారం ఇస్తున్నారనే విషయంపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కేసుకు సంబందించిన వివరాలు తెలిసిన వారే ఇలా అతనికి సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హరికిషన్‌దాస్‌ వెనుక ఎవరున్నారు..?
ఇంత పెద్ద వసూళ్ల కార్యక్రమానికి కేవలం బెయిల్‌పై బయట తిరుగుతున్న వ్యక్తి వల్లే సాద్యం కాదనేది ఇట్టే అర్థమవుతుంది. అయితే హరికిషన్‌దాస్‌కు సహకరించినవారితోపాటు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తులను కూడా టార్గెట్‌చేస్తేనే ఈ కేసు విచారణ పూర్తి కావడంతోపాటు నిందితుడు పోలీసులకు చిక్కే అవకాశం ఉన్నట్లు బాదితులు చెబుతున్నారు. హరికిషన్‌దాస్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి లక్షలాధి రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయని, ఇవి ఎవరికి వెళ్లాయో వారితోపాటు ఈ దందాలో హరికిషన్‌దాస్‌తోపాటు ఉన్న ముఠా సభ్యులను పట్టుకుంటే అన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ అమాయకులను మోసం చేసిన వైట్‌కాలర్‌ నేరస్తుడు ఇలా తప్పించుకుతిరగడం బాదితులకు మాత్రం మింగుడు పడటం లేదు. అయితే హరికిషన్‌దాస్‌ వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలతోపాటు సెక్రటిరియేట్‌ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారని, ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని బాదితులు కోరుతున్నారు. హరికిషన్‌దాస్‌ అక్రమ వసూళ్లకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలో అందిస్తాం.

కోలకాని నవీన్‌కుమార్,
సీనియర్‌ కరస్పాండెంట్, న్యూస్‌ 360, ఖమ్మం

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం