బంగారం, డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు చిక్కడం సాధారణంగా చూస్తుంటాం. కానీ తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానశ్రమయంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి 47 కొండచిలువలు (pythons), రెండు బళ్లులతో అధికారులకు దొరికాడు.
వివరాళ్లోకి వెళ్తే.. మలేషియాలోని కౌలాలంపూర్‌కు చెందిన మహమ్మద్ మొయిదీన్ అనే వ్యక్తి తనతో పాటు 47 కొండచిలువలు, రెండు బల్లులను అక్రమంగా భారత్‌కు ఆదివారం తీసుకువచ్చాడు. విమానం ల్యాండ్ అయిన అనంతరం అతడి బ్యాగ్‌లో ఏదో ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు అనుమానించి తనిఖీ చేశారు. అందులో పలు జాతులకు చెందిన కొండచిలువలను గుర్తించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకున్నారు. వాటిని తిరిగి మలేషియాకు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.