ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ లోగో అయిన పక్షి గుర్తు మారనుంది. ఈ విషయన్ని ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ”త్వరలోనే ట్విటర్ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి పోస్టు చేసిన X లోగో బాగుంటే రేపటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా లైవ్‌లోకి వస్తుంది’’ అని ట్వీట్ చేశారు. దాంతో పాటు ట్విట్టర్ కలర్‌ను డీఫాల్ట్‌గా బ్లాక్‌గా మారుస్తామని కూడా పేర్కొన్నారు. మస్క్ ట్విటర్‌ను గతేడాది కొనుగోలు చేసిన నాటి నుంచి ఇదే అతిపెద్ద మార్పుగా నిలవనుంది. ట్విటర్‌ను సరికొత్తగా ఏర్పాటు చేసిన ‘ఎక్స్ కార్ప్’ అనే కంపెనీలో విలీనం చేస్తున్నట్లు గతంలో మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే.