ఉద్యోగాలు నిర్వహించే ప్రతి వారికి తప్పక పీఎఫ్ కట్ అవుతూ ఉంటుంది. వారి నుంచి కంపెనీ కట్ చేసిన పీఎప్ సొమ్ము ఎప్పటికప్పుడు తమ ఖాతాలో జమ అవుతుందో లేదో తెలుసుకోవాలని ఉద్యోగులకు ఉంటుంది. అయితే ప్రతి నెలా తమ జీతం నుంచి కట్ చేసిన సొమ్ము జమ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే EPFO సంస్థ నిర్వహించబడుతుంది. ఇందులో ఆయా సంస్థలు తమ ఉద్యోగుల జీతం నుంచి 12 శాతం పీఎఫ్ కట్ చేయాలనే నిబంధన ఉంది. ఈ సొమ్ముకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తుంది. ఈ వడ్డీ రేటును ప్రతి సంవత్సరం ఒకసారి ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది. ఉద్యోగుల నుంచి కట్ చేసిన ఈ సొమ్మును వారివారి ఖాతాల్లో ప్రతి నెలా జమచేయాల్సిన బాధ్యత ఉద్యోగ సంస్థలకు ఉంది.
తమ యాజమాన్యం తమ ఖాతాల్లో పీఎఫ్ జమచేసిందో లేదో తెలుసుకోవాలనుకునేవారు కేవలం ఒక్క నంబర్ కు మిస్ట్ కాల్ ఇస్తే చాలు. తక్షణమే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కు పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో మీ ఫోన్ కు మెసేజ్ వస్తుంది. మీ ఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకునేందుకు 9966044425 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు. దీనిద్వారా మీ పీఎప్ ఖాతాలో జమ అయిన మొత్తం బ్యాలెన్స్ ఎంత ఉందో మీకు మెసేజ్ వస్తుంది.
అయితే దీని కోసం మీ UAN యాక్టివ్ లో ఉండాలి. అకౌంట్ ఉన్నవారి మొబైల్ నంబర్ కూడా UANతో రిజిష్టర్ అయ్యి ఉండాలి. ఆధార్, పాన్ కార్డు తో UAN వివరాలు పూర్తి చేయవలసి ఉంటుంది. SMS ద్వారా కూడా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
EPFOHO UAN అని 7738299899 నంబర్ కు మెసేజ్ చేయాలి. కాగా, ఇక్కడ UAN అంటే నంబర్ ఎంటర్ చేయాలి.
EPFO అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
వెబ్ సైట్: www.epfindia.gov.in ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి Our Services ట్యాబ్ పై క్లిక్ చేయాలి. అనంతరం For Employees ఆప్షన్ క్లిక్ చేయాలి. తరువాత మెంబర్ పాస్‌బుక్ ను ఎంచుకోవాలి. తర్వాత UAN, PASSWORD ద్వారా లాగిన్ వివరాలు తెలుసుకోవచ్చు.