Zomato- ఇక నుంచి రైళ్లలో జొమాటో

జొమాటోతో IRCTC చేతులు కలిపింది. ప్రయాణికులకు మరిన్ని ఫుడ్‌ ఆప్షన్లను అందించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ-క్యాటరింగ్‌ సేవల కింద ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. ముందుగా బుక్‌ చేసుకున్న ఆ ఆర్డర్లను జొమాటో యాప్‌ సాయంతో వారికి అందించనుంది. అయితే ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ఐదు స్టేషన్లకు మాత్రమే పరిమితం చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని స్టేషన్లకూ విస్తరించే అవకాశం ఉంది. ‘ప్రూఫ్‌ ఆఫ్‌ కాన్సెప్ట్‌ ’ కింద ప్రస్తుతానికి న్యూదిల్లీ, ప్రయాగ్‌రాజ్‌, కాన్పూర్‌, లఖ్‌నవూ, వారణాసి రైల్వే స్టేషన్లలో అమలు చేయనుంది. మరోవైపు పండగ సీజన్‌ నేపథ్యంలో రైల్వే క్యాటరింగ్‌ సర్వీస్‌ ప్రత్యేక సేవలు, ఆఫర్లతో ముందుకు వచ్చింది. నవరాత్రి సందర్భంగా ఉపవాసం చేసే వారి కోసం ప్రత్యేక ‘థాలీ’ని అందిస్తోంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం