Rahul Gandhi- మణిపుర్‌లో దేశాన్ని హత్య చేశారు: రాహుల్‌ గాంధీ

అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) భాజపాపై ధ్వజమెత్తారు. మణిపుర్‌ అంశంపై ప్రభుత్వాన్ని నిందిస్తూ దేశాన్ని హత్య చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన రెండో రోజు చర్చను రాహుల్‌ గాంధీ ప్రారంభించారు. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధించినందకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు.

”గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు మీ సీనియర్‌ నాయకుడు భాద పడ్డారేమో. కానీ ఈ రోజు అదానీ గురించి మాట్లాడటం లేదు. కాబట్టి భాజపా మిత్రులు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల క్రితం నేను మణిపుర్‌ వెళ్లాను. కానీ, మన ప్రధాని అక్కడికి ఇప్పటివరకు వెళ్లలేదు. ఆయన దృష్టిలో మణిపుర్‌ భారత్‌లో లేదు. మణిపుర్‌ ఇప్పుడు ఏమాత్రం మిగిలిలేదు. ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టారు” అని రాహుల్ అన్నారు.

”మణిపుర్‌లో దేశం ప్రాణం తీశారు. దేశమంటే ఓ గొంతుక, అది ప్రజల హృదయ స్పందన. మణిపుర్‌లో భరత మాతను హత్య చేశారు. నా తల్లి ఒకరు ఇక్కడ ఉన్నారు.. మరో తల్లిని మణిపుర్‌లో చంపారు. భారత సైన్యం ఒక్కరోజులోనే మణిపుర్‌లో శాంతి తీసుకురాగలదు. కానీ, అలా చేయడం లేదు. ప్రధాని దేశ గుండె చప్పుడు వినడంలేదు” అని రాహుల్‌ లోక్‌సభలో పేర్కొన్నారు. కాగా, ప్రసంగం అనంతరం ఆయన సభ నుంచి వెళ్లిపోయారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం