aswin
Home » WorldCup2023 అశ్విన్‌ రీ ఎంట్రీకి కారణమదేనా?

WorldCup2023 అశ్విన్‌ రీ ఎంట్రీకి కారణమదేనా?

by admin
0 comment

ప్రపంచకప్‌ (WorldCup2023) ప్రారంభానికి ముందుగా స్వదేశంలో టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. మెగాటోర్నీకి భారత జట్టుకు ఇదే చివరి సన్నాహకం. ఈ సిరీస్‌కు భారత జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది. కీలక ఆటగాళ్లకు తొలి రెండు వన్డేల్లో విశ్రాంతినిచ్చారు. కానీ ఆఖరి వన్డేకు మాత్రం అందుబాటులో ఉండనున్నారు. అయితే అనూహ్యంగా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను జట్టులోకి చేర్చారు. గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో చివరిగా అతడు వన్డే ఆడాడు. తర్వాత 50 ఓవర్స్‌ ఫార్మాట్‌లో ఆడలేదు. అయితే వన్డే ప్రపంచకప్‌ జట్టుకు కూడా ఎంపిక చేయని అశ్విన్‌ను ఇప్పుడు ఎందుకు ఎంపిక చేశారనేది అందరిలోని ప్రశ్న.

ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో అతడిని ఆసీస్‌తో జరిగే రెండు వన్డేలకు కూడా సెలక్ట్‌ చేయలేదు. మూడో వన్డేలో అతడి ఫిట్‌నెస్‌ను బట్టి అందుబాటులోకి వస్తాడని సెలక్టర్లు చెప్పారు. అయితే అక్షర్‌ ప్రపంచకప్‌ సమరానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోతే అశ్విన్‌ను తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ యోచిస్తోందని తెలుస్తోంది. ఎంతో అనుభవం ఉన్న అశ్విన్‌ కీలక మ్యాచ్‌ల్లో సత్తాచాటగలడని గతంలోనూ నిరూపించాడు. గత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో అతడు వైడ్‌ బాల్‌ను వదలడం, తర్వాత బంతికి పరుగులు సాధించి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించడం అందరికీ తెలిసిందే. అందుకే అతడిని ప్రపంచకప్‌లో తీసుకోవాలని భావిస్తోందని కొందరు క్రికెట్‌ నిపుణులు అంటున్నారు.

మరోవైపు బెన్‌స్టోక్స్‌ వన్డేల్లో రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోని భారీ శతకం బాది తాను ఎంత ప్రమాదకరమో సంకేతాలు పంపాడు. ఇక ఇదే ఆఖరి ప్రపంచకప్‌గా భావిస్తున్న డేవిడ్‌ వార్నర్‌, డికాక్‌, స్టీవ్‌ స్మిత్‌, జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారిని కట్టడిచేయాలంటే అశ్విన్‌ అవసరమని క్రికెట్‌ నిపుణులు భావిస్తున్నారు. వారిపై మెరుగైన రికార్డు అశ్విన్‌కు ఉందని, అంతేగాక ఎడమచేతి వాటం బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో అశ్విన్‌ తర్వాతే ఎవరైనా అని చర్చిస్తున్నారు. అందుకే టీమిండియా మేనేజ్‌మెంట్‌ యాష్‌ను తిరిగి జట్టులోకి తీసుకుందని అంటున్నారు.

భారత్‌-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ జట్ల ఎంపిక
మొదటి రెండు వన్డేలకు టీమిండియా
కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

మూడో వన్డేకు టీమ్‌ఇండియా
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్య (వైస్‌కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అశ్విన్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి, అక్షర్‌ పటేల్* (అక్షర్‌ పూర్తి ఫిట్‌నెస్‌ను సాధిస్తేనే)

ఆసీస్ జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కెరీ, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టాయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links