అక్షర్ పటేల్ గాయం రవిచంద్రన్ అశ్విన్‌కు వరంలా మారింది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌కు అక్షర్ స్థానంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌ను సెలక్టర్లు ఎంపికచేశారు. ఈ మేరకు తుది జాబితాను గురువారం వెల్లడించారు. ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ గాయపడిన విషయం తెలిసిందే. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే అతడు పూర్తిగా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో మెగాటోర్నీకి కూడా దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో అశ్విన్‌ను తీసుకున్నారు.
అనుభవమే అశ్విన్ బలం
ఇటీవల జరిగిన ఆసీస్‌తో జరిగిన సిరీస్‌ను మినహాయిస్తే అశ్విన్ వన్డే ఫార్మాట్ ఆడి దాదాపు ఏడాదిన్నర అయ్యింది. అయినా అతడు ఫామ్‌ను కోల్పోలేదు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించాడు. అంతేగాక ఎంతో అనుభవం ఉన్న అశ్విన్ కీలక మ్యాచ్‌ల్లో సత్తాచాటగలడని గతంలోనూ యాష్ నిరూపించాడు. గత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో అతడు వైడ్ బాల్‌ను వదలడం, తర్వాత బంతికి పరుగులు సాధించి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించడం అందరికీ తెలిసిందే. మరోవైపు కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఎడమచేతి వాటం స్పిన్నర్లు కావడంతో అశ్విన్‌కు మరింత కలిసొచ్చింది. అందుకే అతడిని ప్రపంచకప్‌లో తీసుకున్నారని క్రికెట్ నిపుణులు అంటున్నారు.
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషాన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా