World cup- బై బై పాకిస్థాన్‌

వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్‌ అవకాశాల ఉత్కంఠకు ముగింపు లభించింది. శ్రీలంకపై భారీ విజయం సాధించిన న్యూజిలాండ్ సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది. అయితే నాకౌట్‌ దశకు అర్హత సాధించాలనుకున్న పాకిస్థాన్ ఆశలు ఆవిరయ్యాయి. కివీస్‌ దెబ్బకి.. మరో మ్యాచ్‌ ఉండగానే పాక్‌ ఇంటిముఖం పట్టింది. అయితే ఆ జట్టు టెక్నికల్‌గా సెమీస్‌ రేసులో ఉన్నా.. అది జరగడం అసాధ్యమే. ఎందుకంటే ఇంగ్లాండ్‌ను పాక్‌ కనీసం 287 పరుగుల తేడాతో ఓడించాలి. ఒక వేళ మొదట ఇంగ్లాండ్‌ 150 రన్స్‌కే పరిమితమైనా .. ఆ లక్ష్యాన్ని పాకిస్థాన్‌ కేవలం 3.4 ఓవర్లలోనే అందుకోవాలి. ఇక అఫ్గానిస్థాన్ సెమీస్‌ చేరాలంటే దక్షిణాఫ్రికాపై కనీసం 438 పరుగుల తేడాతో విజయం సాధించాలి. సెమీఫైనల్లో వాంఖడే వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌, ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్‌ తలపడనున్నాయి.

మరోవైపు పాక్‌ను ట్రోల్ చేస్తూ భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘‘పాకిస్థాన్‌ ఇక పరిగెత్తడమే. మీ ప్రయాణం ఇక్కడి వరకే. మా ఆతిథ్యం, బిర్యానీ మీరు ఆస్వాదించారని అనుకుంటున్నా. సురక్షితంగా ఇంటికి చేరండి. బైబై పాకిస్థాన్‌’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో సెహ్వాగ్ పోస్టు చేశాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం