Women reservation bill- రాష్ట్రపతి ఆమోదం

పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ బిల్లును సెప్టెంబర్ 19న లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. చర్చ అనంతరం లోక్‌సభ ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. అనంతరం సెప్టెంబర్ 21న రాజ్యసభలోనూ ప్రవేశపెట్టగా బిల్లు ఆమోదం పొందింది. నేడు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. అయితే బిల్లు చట్టం రూపం దాల్చినప్పటికీ తక్షణం అమల్లోకి వచ్చే అవకాశాలు లేవు. జనగణన, డీలిమిటెషన్ తర్వాత చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. 2024 ఎన్నికలు అనంతరం జనగణన ప్రారంభిస్తారు. ఇక డీలిమిటేషన్ ప్రక్రియ 2026 తర్వాత జరగనుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం